Home> వినోదం
Advertisement

Anand Devarakonda: దేవరకొండ ఫెయిల్యూర్ ప్రేమకథ..అసలు విషయం బయటపెట్టిన హీరో..

Vijay Devarakonda Brother: దొరసాని మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఆనంద దేవరకొండ. కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ కుర్ర హీరో బేబీ మూవీలో లవ్ ఫెయిల్యూర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అయితే ఆ నటన వెనక నిజంగా ఓ లవ్ ఫెయిల్యూర్ దాగి ఉందట.

Anand Devarakonda: దేవరకొండ ఫెయిల్యూర్ ప్రేమకథ..అసలు విషయం బయటపెట్టిన హీరో..

Baby Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. అలాంటి హీరో తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. అతను నటించిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆనంద్ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే మూవీ హిట్ క్రెడిట్ మొత్తం హీరోయిన్ వైష్ణవి చైతన్య ఖాతాలోకి వెళ్ళడంతో ఆనంద్ కు ఈ మూవీ నుంచి పెద్దగా క్రెడిట్ అందలేదు.

అయితే బేబీ సినిమాలో లవ్ ఫెయిల్యూర్ అయిన పర్సన్ గా ఈ యంగ్ హీరో ఎంతో నేచురల్ గా నటించాడు. ఇంత సహజంగా ఎమోషన్స్ ని ఎలా పలికించాడు అని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు.దీని వెనక సీక్రెట్ ఇప్పుడు తెలుస్తోంది.ప్రస్తుతం వెలటైన్స్ వీక్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆనంద్ తన లవ్ ఫెయిల్యూర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

ఆనంద్ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడట. అమ్మాయి పై చదువుల కోసం విదేశాలకు వెళ్తే ..వదిలి ఉండలేక ఆనంద్ కూడా ఆమె వెంటే విదేశాలకు వెళ్ళాడట. ఆమెపై ఎంత ఇష్టం ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ తో అర్థమవుతుంది. ఆమె కోసం చికాగోలో టాప్ ఫైవ్ కాలేజస్ కి అప్లై చేసి ఫైనల్ గా ఒక కాలేజీలో సీటు దక్కించుకున్నాడు ఆనంద్. ఇంత కష్టపడి సప్త సముద్రాలు దాటి ఏ అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడో.. ఆ అమ్మాయి చేతిలోనే మోసపోయాడట.

ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో.. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ నీ కుటుంబాన్ని అందర్నీ వదిలిపెట్టి అంత దూరం అమ్మాయి కోసం ఆనంద్ చికాగో కి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్లాక ఆ అమ్మాయి గురించి వాస్తవాలు తెలుసుకొని భరించలేక ఇంటికి తిరిగి వచ్చేసాడు. రావడం అయితే వచ్చాడు కానీ ఈ బ్రేకప్ బాధ నుంచి బయటపడడానికి మాత్రం అతనికి నాలుగైదు వేలు టైం పట్టిందట. అన్ని సంవత్సరాలు అమ్మాయి కోసం బాధపడ్డాడు అంటే ఆ అమ్మాయిని ఆనంద్ ఎంతగా ప్రేమించాడు అర్థం అవుతుంది. ఈ విషయాన్ని ఆనంద్ స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించాడు.

Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More