Home> వినోదం
Advertisement

Indian Idol Season 3: ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ.. ప్రోమో వైరల్..

Indian Idol Season 3:  ప్రస్తుతం తెలుగులో సహా ఇతర భాషల్లో రియాలిటీ షోలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రెజెంట్ తెలుగులో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది. తాజాగా ఇండియన్ ఐడల్ సీజన్ 3లో విజయ్ దేవరకొండ సందడి చేయనున్నారు.    

Indian Idol Season 3: ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3కు ముఖ్య అతిథిగా  విజయ్ దేవరకొండ.. ప్రోమో వైరల్..

Indian Idol Season 3: గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ తో తెలుగు రియాల్టీ షోలలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తూ దూసుకుపోతుంది ఇండియన్ ఐడల్ సీజన్ 3. అంతేకాదు ఎప్పటి కపుడు ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలు కూడా సందడి చేసి కంటెస్టెంట్స్ కు మంచి ఉత్సాహం అందిస్తున్నారు. ఈ వారంఎపిసోడ్స్ కి స్పెషల్ గెస్ట్ గా 'కల్కి 2898 ఏ.డీ'లో ధనుర్ధారి అర్జున గాండీవధారి పాత్రలో  కనిపించిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సందడి చేస్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ మరింత ఫన్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ  ఎలక్ట్రిఫైయింగ్ ప్రెజెన్స్ తో కూడిన ప్రోమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఈ ప్రోమో  తుఫాన్ గా మారింది.ఈ ప్రోమోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..ఈ షోకి రావడం చాలా ఆనందంగా వుందన్నారు. ఆహా మన ఫ్లాట్ఫామ్. మన తెలుగు కంటెస్టెంట్స్ కి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ రియాలిటీ షోకు విచ్చేసినట్టు చెప్పుకొచ్చాడు.  మీ జర్నీలో భాగంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చినట్టు ప్రోమోలో చెప్పారు విజయ్.

విజయ్ దేరరకొండ ఈ రియాలిటీ  షోకి రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ డబుల్ మ్యూజికల్ ట్రీట్ గా ఉండనుంది.  టీజర్ లో చూపించిన గ్లింప్స్ ఎపిసోడ్ పై చాలా క్యురియాసిటీని పెంచాయి. ఈ వారం నుంచే కంటెస్టెంట్స్ పై  ఓటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. హైలీ యాంటిసిపేటెడ్ తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ అవుతోంది.

Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More