Home> వినోదం
Advertisement

Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!

Kushi Movie Review and Public Talk: అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖుషి మూవీ బాక్సాఫీసు వద్ద సందడి మొదలు పెట్టింది. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్‌లో తమ రివ్యూలు ఇస్తున్నారు. విజయ్, సామ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ చేరిందా..? ఆడియన్స్ ఏమంటున్నారు..?
 

Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!

 Kushi Movie Review and Public Talk: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు (సెప్టెంబర్ 1) ఆడియన్స్ ముందుకు రానుంద. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను ఖుషి అందుకుంటుందా..? ట్విట్టర్ రివ్యూ టాక్ ఎలా ఉంది..? ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన వారి రివ్యూలు ఎలా ఉన్నాయి..? ఓ లుక్కేద్దాం పదండి..

ట్విట్టర్‌లో వన్ వర్డ్ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ వస్తోంది. మళ్లీ మళ్లీ సినిమా చూడొచ్చని అంటున్నారు. మూవీ చాలా వినోదాత్మకంగా ఉందని చెబుతున్నారు. రెగ్యులర్ కథ అయినా.. సినిమాల్లో కామెడీ చాలాబాగా వర్కౌట్ అయిందంటున్నారు. చివరి 30 నిమిషాల్లోని ఎమోషనల్ సీన్స్ హైలెట్ అని చెబుతున్నారు. ఇలాంటి సినిమాకి సరిగ్గా సరిపోయే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారని ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయ్, సామ్ జోడి కెమెస్ట్రీ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. 

 

 

 

"ఆ ర్యాంపేజ్ ఏంటి రా.. ఫస్ట్ టైమ్ సీతారామం తర్వాత ఇలాంటి ప్రేమకథ చూస్తున్నా. చాలా ప్యూర్ అండ్ నీట్‌గా ప్లే చేశారు. విప్లవ్ యాక్టింగ్..  ఆరాధ్య ఒక అందమైన అమ్మాయి.. ఆ పెయిర్ చాలా చాలా బాగుంది. బెస్ట్ స్టోరీ. కామెడీ అయితే నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. థ్యాంక్స్ శివనిర్వాణ" అని రివ్యూ ఇస్తున్నారు.

 

 

ఖుషి మంచి సినిమా అని మెచ్చుకుంటున్నారు. స్టోరీ సింపుల్‌గా ఉంటుందని.. విజయ్, సమంతలు బాగా యాక్ట్ చేశారని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తుందని.. సెకండాఫ్‌లో ఎమోషన్స్ సీన్స్ చాలా బాగున్నాయని చెబతుఉన్నారు. గుడ్‌ఫీల్‌తో థియేటర్‌ నుంచి బయటకు వస్తారని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, సమంత ఖాతాలో హిట్ చేరినట్లేనని నెటిజన్లు అంటున్నారు.

 

 

"కుషి ఓవరాల్ రివ్యూ: హిట్ బొమ్మ 
1వ హాఫ్: గుడ్
2వ హాఫ్:  సూపర్
విజయ్, సామ్ వల్ల క్యారెక్టర్‌లో జీవించారు, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. అద్భుతమైన కథ. సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్ చాలా బాగుంది.." అంటూ రివ్యూ ఇస్తున్నారు.

 

 ఖుషి మూవీకి బ్లాక్‌బస్టర్ హిట్ టాక్స్ వస్తుండడంతో విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు సంతోషంతో థియేటర్ల ముందు సందడి చేస్తున్నారు. హిట్ కొట్టేశాం రా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూడని వాళ్లు వెయిటింగ్ అంటూ తమ ఆసక్తిని చూపిస్తున్నారు. అన్నివైపులా నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ కూడా సంబరాలకు రెడీ అయింది. 

  

Read More