Home> వినోదం
Advertisement

Vennela Kishore : ఎంత పని చేశావ్ బ్రో.. వెన్నెల కిషోర్ చేసినదానికి నెటిజన్ రియాక్షన్

Swathi muthyam Movie గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ కాంబోలో వచ్చిన స్వాతి ముత్యం సినిమాకు మంచి టాక్ వచ్చింది. డీసెంట్ కలెక్షన్లతో స్వాతి ముత్యం హిట్టుగా నిలిచింది.

Vennela Kishore : ఎంత పని చేశావ్ బ్రో.. వెన్నెల కిషోర్ చేసినదానికి నెటిజన్ రియాక్షన్

Vennela Kishore in Swathi muthyam : వెన్నెల కిషోర్ లేని సినిమా అంటూ ఈ మధ్య రావడం లేదు. వెన్నెల కిషోర్ కామెడీని జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమాలు వచ్చేవి కావు. ఆ తరువాత సునీల్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. సునీల్ తరువాత వెన్నెల కిషోర్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇక సునీల్ హీరోగా సైడ్ అయిపోవడంతో వెన్నెల కిషోర్‌కు మరింత అవకాశం దొరికినట్టు అయింది. వెన్నెల కిషోర్ పాత్రలు, ఆయన కామెడీ టైమింగ్ ఇష్టపడని తెలుగు ప్రేక్షకులుండరు.

అయితే మధ్యలో వెన్నెల కిషోర్ కూడా మూసధోరణిలోకి వెళ్లాడని, ఎప్పుడూ అవే పాత్రలు, అదే కామెడీ అని అన్నారు. కానీ వెన్నెల కిషోర్ మాత్రం నవ్విస్తూనే ఉన్నాడు. జనాలు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ వెన్నెల కిషోర్ అందరినీ నవ్విస్తుంటాడు. కాకా అంటూ ముందుగా వెన్నెల కిషోర్‌కు ట్వీట్లు పెడుతుంటారు ఫ్యాన్స్.

 

మొన్నటికి మొన్న మంచు విష్ణు జిన్నా సినిమా, బెల్లకొండ గణేష్ స్వాతి ముత్యం సినిమాల్లో నవ్వులు పూయించేశాడు. మరీ ముఖ్యంగా స్వాతి ముత్యం సినిమాలో అయితే ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. సరోగసి ద్వారా బిడ్డను కంటే హీరోకు వచ్చే సమస్యల, అతని ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడం, చివరకు మళ్లీ కలుసుకోవడం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.

ఈ కథలో హీరోను సరోగసికి ఒప్పించేది మాత్రం వెన్నెల కిషోర్. అతను చేసిన పనికే హీరోకు కష్టాలు వస్తాయి.ఇప్పుడు ఇదే విషయాన్ని ఓ నెటిజన్ పాయింట్ అవుట్ చేశాడు. స్వాతి ముత్యం సినిమా ఎంతో వినోదాత్మకంగా ఉంది.. బెల్లంకొండ గణేష్ హీరోగా మొదటిసినిమా అదరగొట్టేశాడు.. ఎంత పని చేశావ్ బ్రో అంటూ వెన్నెల కిషోర్‌కు ట్యాగ్ చేశాడు. దీనికి వెన్నెల కిషోర్ రిప్లై ఇస్తూ.. కళ్లు మూసుకుని నవ్వుతున్న కోతి బొమ్మను షేర్ చేశాడు.

Also Read : Niharika Konidela Tattoo : ఆ ప్లేస్‌లో నిహారిక సీక్రెట్ టాటూ.. హాట్ ఫోటోలు వైరల్

Also Read : Sudigali Sudheer : స్టేజ్ మీద కలిసి కలిసిన జోడి.. భాను శ్రీ పాట.. ఏడ్చిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More