Home> వినోదం
Advertisement

Venkatesh Maha Warning:వెబ్ సిరీస్లో బూతులు.. కేజీఎఫ్ దెబ్బకు వెంకటేష్ 'మహా' ముందు జాగ్రత్త..వార్నింగ్!

Venkatesh Maha Statutory Warning: తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్రలో నటించిన ఆంథాలజీ సిరీస్ యాంగర్ టేల్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు

Venkatesh Maha Warning:వెబ్ సిరీస్లో బూతులు.. కేజీఎఫ్ దెబ్బకు వెంకటేష్ 'మహా' ముందు జాగ్రత్త..వార్నింగ్!

Venkatesh Maha Statutory Warning for Anger Tales: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కెజిఎఫ్ మీద చేసిన కామెంట్ల వల్ల వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఆయన తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా కూడా చేశారు. అయితే ఈ రెండు ఆయనకు తీసుకురాని పేరును కేజిఎఫ్ మీద చేసిన కామెంట్లు తీసుకొచ్చాయి. ఇక తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన ఆంథాలజీ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమైంది.

సుహాస్, తరుణ్ భాస్కర్, బిందు మాధవి, మడొన్నా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, ఫణి ఆచార్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ ఆంథాలజీ సిరీస్ మార్చి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది, నితిన్, ప్రభల తిలక్ డైరెక్ట్ చేసిన ఈ ఆంథాలజీ సిరీస్ కి సంబంధించిన నాలుగు కథలకు నలుగు సినిమాటోగ్రాఫర్లు పని చేశారు.  అంతేకాకుండా ఈ ఆంథాలజీ సిరీస్ కి సుహాస్ ఒక నిర్మాతగా వ్యవహరించగా మరొక నిర్మాతగా శ్రీధర్ రెడ్డి వ్యవహరించారు. ఈ సిరీస్లో వెంకటేష్ మహా కీలకపాత్రలో నటించడంతో ఆయన ఎక్కడ దొరుకుతాడా? ఎలా ట్రోల్ చేద్దామా? అని కేజిఎఫ్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎందుకైనా మంచిదని ఆయన ఒక వార్నింగ్ విడుదల చేశారు. అదేమిటంటే రాబోయే యాంగర్ టేల్స్ అనే సిరీస్లో తాను నటించిన ఎపిసోడ్ ‘రంగా’లో కథానుసారంగా 18 ఏళ్ల లోపు వారికి తగని భాష వాడబడినదని ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు తల్లిదండ్రులను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు.

కానీ మిగిలిన మూడు ఎపిసోడ్లు రాధ, గిరి, పూజా మాత్రం కుటుంబ సమేతంగా చూసి ఆనందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక రంగ అనే ఎపిసోడ్లో వెంకటేష్ మహా ఒక స్టార్ హీరో అభిమాని రంగా పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పాత్ర కథానుసారం అనేక రకాల బూతులు మాట్లాడుతుంది, ఇక ఈ బూతులు వల్ల తనను ఎక్కడ ట్రోల్ చేస్తారో అనే ఉద్దేశంతో ముందుగానే వెంకటేష్ మహా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Andrea Jeremiah Naked: నగ్నంగా మారి వుమెన్స్ డే విషెస్ చెప్పిన ఆండ్రియా.. వైరల్ గా ఫోటో!

Also Read: Power Star Pawan Attacked: లైవ్లో పవర్ స్టార్ పవన్ మీద దాడి.. తీవ్రంగా ఫైర్ అయిన హీరో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 
 
Read More