Home> వినోదం
Advertisement

Venkatesh - Anil Ravipudi Hattrick Combination: ఉగాది పండగ సందర్భంగా వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా అఫీషియల్ ప్రకటన..

Venkatesh - Anil Ravipudi Hattrick Combination: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో ఓ సినిమా హిట్టైయితే ఆ కాంబినేషన్‌లో మరో సినిమా చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. తెలుగులో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు అంతే క్రేజ్ ఉంది. తాజాగా వీళ్ల మూడు చిత్రానికి సంబంధించిన ప్రకటన ఉగాది పండగ నేపథ్యంలో అఫీషియల్‌గా ప్రకటించారు.

Venkatesh - Anil Ravipudi Hattrick Combination: ఉగాది పండగ సందర్భంగా వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా అఫీషియల్ ప్రకటన..

Venkatesh - Anil Ravipudi Hattrick Combination: హీరో వెంకటేష్‌ ఈ యేడాది సంక్రాంతికి 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.  దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై వెంకీ మామ నజర్ పెట్టాడు. అది కూడా తనకు ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన అనిల్ రావిపూడితో హాట్రిక్ కాంబినేషన్‌కు రెడీ అయ్యాడు. ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రటించారు. ఇది కూడా అనిల్ రావిపూడి మార్క్ ఓ హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్ గా ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే  అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తైయింది.  బాలయ్యతో 'భగవంత్ కేసరి' తర్వాత వెంకటేష్‌తో హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్ చేస్తున్నాడు.  దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతోన్న 58వ చిత్రం.

ఈ సినిమాను ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్‌తో  పూర్తి హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' టైపులో ఈ సినిమా ఉండబోతుందన్నట్టు సమాచారం. ఇందులో ఒక హీరోయిన్‌గా త్రిష ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది. మరో కథానాయికగా ఎవరిని తీసుకుంటారా అనేది చూడాలి.  ఈ సినిమాకు 'సంక్రాంతి వస్తున్నాం' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.  అంతేకాదు ఈ సినిమాను 2025 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాలో చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు పెళ్లాల మధ్య నలిగే భర్త పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మన చట్టాల ప్రకారం ఒక భార్య ఉండగా.. మరో భార్యను పెళ్లి చేసుకోవడం నేరం. ఫస్ట్ భార్యతో విడాకులు తీసుకోవడం కానీ.. ఆమె ఒప్పకుంటే కానీ రెండో మ్యారేజ్ చేసుకోవడానికి చట్టం అంగీకరించదు. మన సినిమాల్లో హీరో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకున్నట్టు చూపిస్తుంటారు. ఇపుడు వెంకటేష్‌తో  చేయబోతున్న సినిమాలో అదే కాన్సెప్ట్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తాడా.. లేదా అనేది చూడాలి.

వెంకటేష్ నటించిన 'సైంధవ్'  విషయానికొస్తే..  ఈ ఇయర్ సంక్రాంతికి విడుదలైంది. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా.. ఎందుకో వర్కౌట్ కాలేదు.   ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాప చుట్టేసింది. .  ఆ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్.. ఇపుడు అనిల్ రావిపూడితో చేయబోతున్న సినిమాతో మళ్లీ హీరోగా వెంకటేష్ బ్యాక్ బౌన్స్ అవుతాడా ? లేదా అనేది చూడాలి.

Also Read: Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More