Home> వినోదం
Advertisement

VSR vs WV Collections: 'వీర సింహ'కు వీరయ్య దెబ్బ .. 43 కోట్ల ముందంజ!

Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల వ్యవధిలో కలెక్షన్స్ తేడా ఎంత ఉంది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం. 
 

VSR vs WV Collections: 'వీర సింహ'కు వీరయ్య దెబ్బ .. 43 కోట్ల ముందంజ!

Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో సినిమాలను కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇక మొన్నటి సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి ముందుగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన విడుదల అవ్వగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడంతో పాటు రెండు సినిమాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

ఇలా ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒకే పండుగకు రెండు సినిమాలు రిలీజ్ కావడం అనేది ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగకపోవడంతో రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ నటించడంతో ఈ రెండు సినిమాల మీద దాదాపు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ వసూలు చేసింది? ఎవరు ఎలాంటి రికార్డులు సాధిస్తుంది అనే విషయాల మీద టాలీవుడ్ ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమా పదకొండు రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటే వీర సింహారెడ్డి సినిమా పన్నెండు రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.

అయితే మరి రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ తేడా ఎలా ఉంది అనేది పరిశీలిద్దాం. అయితే రెండు వారాంతాలు పూర్తిచేసుకుని మూడవ వారంలోకి అడుగుపెట్టిన వీర సింహారెడ్డి సినిమా కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై తెలుగులో పన్నెండు రోజుల ధియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా 12 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల 55 లక్షల షేర్, 102 కోట్ల 87 లక్షల గ్రాస్ వసూలు చేసి, కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి 12 రోజులకు గాను నాలుగు కోట్ల 76 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో ఐదు కోట్ల 71 లక్షలు వసూలు చేసింది. ఇక వీర సింహ రెడ్డి సినిమా ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల 2 లక్షల షేర్, 124 కోట్ల 51 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

ఇక వాల్తేరు వీరయ్య సినిమాల విషయానికి వస్తే ఈ సినిమా విడుదలయి ఇప్పటికే 11 రోజులు రన్ పూర్తి చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో 96 కోట్ల 93 లక్షల షేర్ 150 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ఇప్పటివరకు 11 రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి ఏడు కోట్ల 55 లక్షలు షేర్ వసూలు చేస్తే ఓవర్సీస్ లో 12 కోట్ల 45 లక్షల షేర్ వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 117 కోట్ల మూడు లక్షల షేర్ 200 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. అయితే వీర సింహారెడ్డి సినిమా కంటే ఒక రోజు ఆలస్యంగా వచ్చినా వాల్తేరు వీరయ్య సినిమా 43 కోట్లు ముందంజలో ఉందని చెప్పాలి.

Also Read: Waltair Veerayya Day 11: మాగా మాస్ కు అడ్డే లేదు.. 200 కోట్లను టచ్ చేసేసిందిగా!

Also Read:  Veera Simha Reddy Day 12 : ఎట్టకేలకు హిట్ కొట్టేసిన బాలయ్య.. లాభం ఎంత అంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 
Read More