Home> వినోదం
Advertisement

Operation Valentine Pre Release Business: 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత.. ? వరుణ్ తేజ్ ముందున్న టార్గెట్ ఇదే..

Operation Valentine Pre Release Business Details: మ్యారేజ్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఫస్ట్ చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరిగింది.

Operation Valentine Pre Release Business: 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత.. ? వరుణ్ తేజ్ ముందున్న టార్గెట్ ఇదే..

Operation Valentine Pre Release Business Details: వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్  పాత్రలో నటించాడు. ఈ సినిమాను 2019లో ఫిబ్రవరి 14న పుల్వామాలో మన దేశ సైనికుల ప్రాణాలను బలిగొన్న ముష్కర మూకలను మన దేశ సైన్యం .. బాలాకోట్‌లో చేసిన సర్జికల్ స్ట్రైక్ దాడుల నేపథ్యంలో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌లోని విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల కారణంగా ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు.

వరుణ్ తేజ్ గత చిత్రాలు వరుస ఫ్లాప్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు. అంతేకాదు అన్ని  ఏరియాల్లో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది.  

ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..

తెలంగాణ (నైజాం).. రూ. 4.5 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 2 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 7.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 14 కోట్లు
కర్ణాటక + రెస్ట్‌ ఆఫ్ భారత్ .. రూ. 3 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈ సినిమా రూ. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది.
 
ఆపరేషన్ వాలెంటైన్ మూవీ చూస్తే.. రీసెంట్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన 'ఫైటర్' మూవీ కూడా దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. అందులో బాలాకోట్‌లో మన దేశ సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. ఇపుడు అదే కాన్సెప్ట్‌తో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని తెరకెక్కింది. 2019లో  ప్రేమికుల దినోత్సవం రోజున దేశ సైనికులను పొట్టన పెట్టుకున్న ముష్కరుల అంతం చేయడానికి మన దేశం చేసిన సర్జికల్ స్ట్రైక్‌కు 'ఆపరేషన్ వాలెంటైన్' పేరు పెట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. ఇందులో ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున రుద్రదేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చక్కగా సరిపోయాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటుల తమ పరిధి మేరకు నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ సహా ప్యాన్ ఇండియా భాషల్లో మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.

'ఆపరేషన్ వాలెంటైన్' మూవీనిశక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. వరుణ్ తేజ్ విషయానికొస్తే.. ముందు నుంచి హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. మరి 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీతో వరుణ్ తేజ్ మరో హిట్ అందుకుంటాడా ? లేదా అనేది చూడాలి.

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More