Home> వినోదం
Advertisement

Varshini About Srikanth Reddy: కరాటే కళ్యాణి vs శ్రీకాంత్ రెడ్డి వివాదంలో వర్షిణి వెర్షన్ ఏంటి ?

Varshini About Karate Kalyani: కరాటే కళ్యాణి, యూట్యూబర్, ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి.. ప్రస్తుతం ఫిలింనగర్‌తో పాటు బుల్లితెర వర్గాల్లోనూ నలుగురి నోళ్లలో నానుతున్న పేర్లు ఇవి. శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కరాటే కళ్యాణి అక్కడే అతడి చెంప చెళ్లుమనిపించడంతో మొదలైన ఈ వివాదం ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి జీ న్యూస్ తెలుగు స్టూడియోకు వచ్చి డిబేట్‌లో కూర్చున్న అనంతరం నెక్ట్స్ లెవెల్‌కి చేరింది.

Varshini About Srikanth Reddy: కరాటే కళ్యాణి vs శ్రీకాంత్ రెడ్డి వివాదంలో వర్షిణి వెర్షన్ ఏంటి ?

Varshini About Karate Kalyani: కరాటే కళ్యాణి, యూట్యూబర్, ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి.. ప్రస్తుతం ఫిలింనగర్‌తో పాటు బుల్లితెర వర్గాల్లోనూ నలుగురి నోళ్లలో నానుతున్న పేర్లు ఇవి. శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కరాటే కళ్యాణి అక్కడే అతడి చెంప చెళ్లుమనిపించడంతో మొదలైన ఈ వివాదం ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి జీ న్యూస్ తెలుగు స్టూడియోకు వచ్చి డిబేట్‌లో కూర్చున్న అనంతరం నెక్ట్స్ లెవెల్‌కి చేరింది. ప్రాంక్స్ పేరుతో శ్రీకాంత్ రెడ్డి బూతు వీడియోలు చేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని కరాటే కళ్యాణి ఆరోపిస్తుండగా.. కరాటే కళ్యాణి వీడియోలు తన ప్రాంక్ వీడియోల కంటే ఇంకా హాట్‌గా ఉన్నాయంటూ, ఆమె హావాభావాలు కూడా రెచ్చగొట్టేవిగా ఉంటాయంటూ శ్రీకాంత్ రెడ్డి కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. ఈ లైవ్ డిబేట్ లోనే శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణి ఇద్దరూ వాగ్వీవాదానికి దిగి మరోసారి దుర్భాషలాడుకున్నారు.   

కరాటే కళ్యాణి vs శ్రీకాంత్ రెడ్డి కాంట్రవర్శియల్ ఎపిసోడ్‌లో కొంతమంది అతడి వైపు నిలిస్తే.. ఇంకొంత మంది కళ్యాణి వైపు నిలిచారు. శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోలు బూతు వీడియోలులాగా శృతి మించిపోతున్నాయని కొంతమంది ఖండిస్తే... సినిమాల్లో రెచ్చగొట్టే, కైపెక్కించే సన్నివేశాల్లో నటించే మీరు అశ్లీలం గురించి మాట్లాడుతున్నారా ? అంటూ ఇంకొంతమంది కరాటే కళ్యాణిని తప్పుపట్టారు. ఇదంతా ఇలా ఉంటే, తాజాగా వర్షిణి అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ జీ న్యూస్ తెలుగు స్టూడియోకు వచ్చారు. గతంలో శ్రీకాంత్ రెడ్డి రూపొందించిన ప్రాంక్ వీడియోల్లో నటించిన వర్షిణి ఈ వివాదంలో ఎవరివైపు నిలుస్తారు ? ఆమెకు కూడా శ్రీకాంత్ రెడ్డి బాధితురాలేనా లేక శ్రీకాంత్ రెడ్డితో (Srikanth Reddy, Karate Kalyani Issue) బెనిఫిట్ పొందిన ఆర్టిస్టా తెలియాలంటే ఇదిగో ఈ డిబేట్ వీక్షించాల్సిందే.

Also read : Karate Kalyani vs Srikanth Reddy: కరాటే కళ్యాణి వీడియోలే మరీ హాట్ అంటున్న శ్రీకాంత్ రెడ్డితో ఫేస్ టు ఫేస్

Also read : Karate Kalyani Reaction : అమ్మాయిలను ఎక్కడెక్కడో టచ్‌ చేస్తూ ప్రాంక్ విడియోలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More