Home> వినోదం
Advertisement

Vakeel Saab Teaser: వకీల్ సాబ్ టీజర్ అదుర్స్

వకీల్ సాబ్ టీజర్ వచ్చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి అసలైన సంక్రాంతి పండగ ఇప్పుడే మొదలైంది. పవర్ స్టార్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ వకీల్ సాబ్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

Vakeel Saab Teaser: వకీల్ సాబ్ టీజర్ అదుర్స్

వకీల్ సాబ్ టీజర్ వచ్చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి అసలైన సంక్రాంతి పండగ ఇప్పుడే మొదలైంది. పవర్ స్టార్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ వకీల్ సాబ్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే, అంతకంటే ముందుగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి కానుకగా నేడు చిత్ర యూనిట్ వకీల్ సాబ్ టీజర్ విడుదల చేసింది.

Also read : Ester Noronha as Adult star: అడల్ట్ ఫిలిం స్టార్‌గా బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ ఎక్స్ వైఫ్

వకీల్ సాబ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ''కోర్టులో వాదించడం తెలుసు... కోటు తీసి కొట్టడమూ తెలుసు'' అంటూ పవర్ స్టార్ చెప్పిన డైలాగ్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని విశేషంగా అలరిస్తోంది. మచ్చుకు టీజర్‌లో వదిలిన ఈ డైలాగ్ చూస్తోంటే... వకీల్ సాబ్ మూవీలో ఇలాంటి పంచ్ డైలాగ్స్ ఇంకా చాలానే ఉన్నాయని అర్థమవుతోందంటున్నారు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) అభిమానులు.

Also read : Uppena teaser: ఆకట్టుకుంటున్న ఉప్పెన మూవీ టీజర్

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తోన్న వకీల్ సాబ్ సినిమాను  దిల్ రాజ్ నిర్మిస్తుండగా బోనీ కపూర్ ప్రజెంట్ చేస్తున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన పింక్ సినిమాకు వకీల్ సాబ్ ( Vakeel Saab movie ) తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More