Home> వినోదం
Advertisement

V movie: వి మూవీ OTT రైట్స్ ఎంతో తెలుసా ?

న్యాచురల్ స్టార్ నాని ( Nani ) నటించిన లేటెస్ట్ మూవీ వి ( V movie ) విడుదలకు సిద్ధమైంది. వీలైతే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని భావించిన చిత్ర నిర్మాత దిల్ రాజు.. కరోనావైరస్ ( Coronavirus ) మరింత విబృంభిస్తోన్న నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వి సినిమాను ఓటిటిపై విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడని గత వారమే చెప్పుకున్నాం. 

V movie: వి మూవీ OTT రైట్స్ ఎంతో తెలుసా ?

న్యాచురల్ స్టార్ నాని ( Nani ) నటించిన లేటెస్ట్ మూవీ వి ( V movie ) విడుదలకు సిద్ధమైంది. వీలైతే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని భావించిన చిత్ర నిర్మాత దిల్ రాజు.. కరోనావైరస్ ( Coronavirus ) మరింత విబృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి మారేలా లేదని గ్రహించారో ఏమో కానీ చివరకు OTT ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసేందుకే మొగ్గుచూపారనే వార్తల్ని మనం గత వారమే చూశాం. ఐతే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ? ఎందులో విడుదల అవుతుందనే విషయంలోనే ఇప్పటివరకు స్పష్టత కొరవడింది. Also read : Kalyani Priyadarshan: సూపర్ స్టార్ కుమారుడితో డైరెక్టర్ కూతురు డేటింగ్

తాజాగా ఫిలింనగర్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి రైట్స్ ( OTT rights prices ) రూ. 30 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 5న వి మూవీని అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు సదరు ఓటిటి ఫ్లాట్‌ఫామ్‌తో కలిసి నిర్మాత దిల్ రాజు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు ( Sudheer Babu ) మరో కీలక పాత్ర పోషించాడు. Also read : Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్

Read More