Home> వినోదం
Advertisement

Janhvi - Akhil: నాగ్ కొడుకుతో శ్రీదేవి కూతురు.. ఆ మ్యాజిక్ కోసమే భారీ ప్రాజెక్ట్ సెట్?

Janhvi Kapoor Akhil Akkineni Magic On Screen: అటు అక్కినేని అఖిల్, ఇటు జాన్వీ కపూర్ కి సినిమాలు హిట్లు లేకపోయినా నాగార్జున కొడుకుగా అఖిల్ శ్రీదేవి కుమార్తెగా జాన్వి కపూర్ థియేటర్లకు ఓపెనింగ్ తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

Janhvi - Akhil: నాగ్ కొడుకుతో శ్రీదేవి కూతురు.. ఆ మ్యాజిక్ కోసమే భారీ ప్రాజెక్ట్ సెట్?

Janhvi Kapoor Akhil Akkineni Magic: అతిలోక సుందరి అనే పేరు వినగానే మన మనసుల్లోకి అప్రయత్నంగానే శ్రీదేవి వచ్చేస్తూ ఉంటుంది. ఆమె తెలుగు అమ్మాయి అయినా ఎక్కువగా తమిళ తెలుగు సినిమాలు చేస్తూ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న సమయంలో అక్కడ అప్పటి టాప్ నిర్మాత ఆయన బోనీకపూర్ తో ప్రేమలో పడి ఆయనకు వివాహం అయింది అన్న సంగతి తెలిసి కూడా వివాహం చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

అయితే దురదృష్టవశాత్తు శ్రీదేవి కన్నుమూసినా ఇప్పుడు బోనికపూర్ తన ఇద్దరు కుమార్తెలను హీరోయిన్లుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే జాన్వి కపూర్ హిందీలో పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు ఎందుకో ఆశించిన స్థాయిలో క్రేజ్ అయితే దక్కలేదు. ఇక బాలీవుడ్ లో దాదాపు ఐదేళ్ల క్రితమే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ వర్కౌట్ కావడం లేదని అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది.

Also Read: Shalini Pandey Photos: రచ్చ లేపిన షాలినీ పాండే.. అర్జున్ రెడ్డి బ్యూటీ హాట్‌ ట్రీట్ చూస్తే ఫ్యూజులు అవుట్

ప్రస్తుతానికి ఆమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా ఇంకా రిలీజ్ కాకపోయినా ఆమెకు రెండు మూడు తెలుగు ఆఫర్లు తలుపుతడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆ సినిమా కోసం ఇప్పుడు జాన్వి కపూర్ ని సినిమా యూనిట్ సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ భామకి మరో అవకాశం కూడా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అక్కినేని అఖిల్ హీరోగా యువి ప్రొడక్షన్ సంస్థ ఒక సినిమా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని నటించమని కోరినట్లుగా తెలుస్తోంది. జాన్వీ కపూర్ కి సినిమాలు హిట్లు లేకపోయినా నాగార్జున కొడుకుగా అఖిల్ శ్రీదేవి కుమార్తెగా జాన్వి కపూర్ థియేటర్లకు ఓపెనింగ్ తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ అదే నిజమైతే కనుక అఖిల్ మరో హిట్టు కొట్టడం ఖాయమని అంటున్నారు.

Also Read: Janhvi Kapoor Telugu Films: మరో రెండు తెలుగు సినిమాలలో జాన్వీ కపూర్.. ఫ్లాఫ్ హీరోకు జతగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
Read More