Home> వినోదం
Advertisement

Uppena Movie: సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.. ఆసక్తిగా Tollywood అభిమానులు

 టాలీవుడ్‌లో అడుగుపెట్టడంతోనే సక్సెస్ సాధించాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో వైష్ణవ్ తేజ్. హీరోయిన్‌ కృతిశెట్టికి సైతం ఇది తొలి మూవీనే అయినా బెస్ట్ ఫర్మార్మెన్స్‌తో ఉప్పెన మూవీ సక్సెస్‌తో తన వంతు పాత్ర పోషించింది. సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.

Uppena Movie: సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.. ఆసక్తిగా Tollywood అభిమానులు

Uppena Movie Latest Update:  టాలీవుడ్‌లో అడుగుపెట్టడంతోనే సక్సెస్ సాధించాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో వైష్ణవ్ తేజ్. హీరోయిన్‌ కృతిశెట్టికి సైతం ఇది తొలి మూవీనే అయినా బెస్ట్ ఫర్మార్మెన్స్‌తో ఉప్పెన మూవీ సక్సెస్‌తో తన వంతు పాత్ర పోషించింది. సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన (Uppena Movie) కలెక్షన్లు సైతం ఉప్పెనలా వస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. 'సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే' అనే లిరికల్ సాంగ్‌ను మూవీ యూనిట్ రేపు లాంచ్ చేయనుంది. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను ఉదయం 10 గంటలకు మీ ముందుకు తీసుకురానున్నారు.

Also Read: Uppena Success Celebration: ఉప్పెన మూవీ టీమ్‌ను అభినందించిన Chiranjeevi, రామ్ చరణ్‌

ఇప్పటికే ఉప్పెన మూవీ సక్సెస్‌ను మెగా ఫ్యామిలీ ఆస్వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు హీరో వైష్ణవ్ తేజ్(Vaisshnav Tej), దర్శకులు సుకుమార్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్ మెగా హీరోలు చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను కలిసి తమ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. మ్యూజికల్ హిట్ సాధించిన ఈ మూవీ ప్రస్తుతం హౌస్ ఫుల్ షోస్ ఆడుతోంది.

Also Read: Sumanth Ashwin Wedding Photos: ఘనంగా టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ వివాహం

కాగా, ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉప్పెన సినిమా అంచనాలు అంచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోయగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలనిజం, కొత్తవాళ్లయినప్పటికీ వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి(Kriti Shetty) తమను నిరూపించుకునేలా నటించారని ప్రశంసలు అందుకుంటున్నారు.

Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More