Home> వినోదం
Advertisement

Krithi Shetty: ఉప్పెన కృతిశెట్టి పారితోషికం ఇప్పుడెంతో తెలుసా

Krithi Shetty: ఉప్పెనల్లే దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. టాలీవుడ్‌లో తెలుగు ప్రేక్షకుల్ని అందచందాలు, హావభావాలతో కట్టిపడేసింది. అందుకే ఇప్పుడు సినీ పరిశ్రమ క్యూ కడుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా..అందుకే రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది ఈ అమ్మడు.

Krithi Shetty: ఉప్పెన కృతిశెట్టి పారితోషికం ఇప్పుడెంతో తెలుసా

Krithi Shetty: ఉప్పెనల్లే దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. టాలీవుడ్‌లో తెలుగు ప్రేక్షకుల్ని అందచందాలు, హావభావాలతో కట్టిపడేసింది. అందుకే ఇప్పుడు సినీ పరిశ్రమ క్యూ కడుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా..అందుకే రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది ఈ అమ్మడు.

టాలీవుడ్‌కు(Tollywood)కరోనా బ్రేక్ అనంతరం మంచి హిట్ ఇచ్చిన సినిమా ఉప్పెన. తెలుగు వెండితెరపై ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి తొలి సినిమా ఇదే. అందచందాలు, అద్భుత నటనతో ప్రేక్షకుల్ని, దర్శక నిర్మాతల్ని కట్టిపడేసింది. ఉప్పెనకు ముందు ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా కొన్ని యాడ్స్‌లో నటించిన కృతిశెట్టి..రేంజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఉప్పెన(Uppena) హీరోయిన్‌గా ఆమె రేంజ్ ఇప్పుడు అందనంత దూరంలో ఉంది. 

ఒకే ఒక్క సినిమాతో కుర్రకారు గుండెల్లో హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఇప్పుడు నానితో శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ పోతినేనితో లింగుస్నామి, నితిన్‌తో మాచర్ల నియోజకవర్గం ఇలా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్‌లో తనకొస్తున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని రెమ్యునరేషన్ కూడా హఠాత్తుగా పెంచేసింది బేబమ్మ. ఉప్పెన సినిమాకు కేవలం 6 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్న కృతిశెట్టికి(Krithi Shetty) ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో గిఫ్ట్ రూపంలో 60 లక్షల వరకూ అందించారట. అందుకే ఇప్పుడు పారితోషికాన్ని భారీగా పెంచేసింది. శ్యామ్ సింగరాయ్ సినిమాను ఉప్పెనకు ముందే ఒప్పుకోవడంతో 20 లక్షల రూపాయలు తీసుకుంటోంది. మిగిలిన సినిమాలకు మాత్రం 80 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటోంది. ఉప్పెన హిందీ రీమేక్ కోసం ఆమెకు నిర్మాతలు కోటి రూపాయల వరకూ ఆఫర్ చేశారని సమాచారం. మొత్తానికి ఒక్క సినిమాతో 6 లక్షల నుంచి కోటి రూపాయల స్థాయికి పెరిగిపోయింది. 

Also read: MAA Elections 2021: పెరుగుతున్న ఉత్కంఠ.. ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More