Home> వినోదం
Advertisement

"పద్మావతి" పై ఉపేంద్ర ఆసక్తికర కామెంట్లు

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, పద్మావతి చిత్ర వివాదంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. గతంలో తన చిత్రాలు కూడా ఇలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నాయని ఆయన తెలిపారు.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, పద్మావతి చిత్ర వివాదంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. గతంలో తన చిత్రాలు కూడా ఇలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నాయని ఆయన తెలిపారు. "మనకంటూ ఒక వ్యవస్థ ఉంది. దానిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనపై ఉంది. నిరసన తెలపడం మన హక్కు. అయితే ఇలాంటి విషయాల్లో దర్శకుడితో మాట్లాడి కూడా వివరణ తెలుసుకోవాలి. వారి అభిప్రాయాలు, వాదనలు వినకుండా ధర్నాలు, సమ్మెలు చేస్తే ఉపయోగం ఏముంది. గతంలో నా సినిమా "హెచ్ 2 ఓ" విడుదలైనప్పుడు కూడా చాలా మంది అభ్యంతరం చెప్పారు.

అయితే అన్ని సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్లేవాడిని. ఏ సమస్యనైనా ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ఒకటే మార్గం" అని ఆయన అన్నారు. ప్రస్తుతం "పద్మావతి" చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పడుకొనేతో కూడా ఉపేంద్ర గతంలో నటించారు. 2006లో వచ్చిన "ఐశ్వర్య" చిత్రంలో ఆమె సరసన హీరోగా నటించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఉపేంద్ర. 

Read More