Home> వినోదం
Advertisement

Unstoppable With NBK: మూడో ఎపిసోడ్ కు కూడా ఇద్దరు కుర్ర హీరోలు.. ఎవరెవరంటే?

Sharwanand and Adivi Sesh for Unstoppable With NBK: ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2లో నందమూరి బాలకృష్ణ ఇప్పటికే రెండు ఎపిసోడ్లు షూట్ పూర్తి చేయగా మూడవ ఎపిసోడ్ కోసం ఇద్దరు హీరోలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. 

Unstoppable With NBK: మూడో ఎపిసోడ్ కు కూడా ఇద్దరు కుర్ర హీరోలు.. ఎవరెవరంటే?

Sharwanand and Adivi Sesh for Unstoppable With NBK Third Episode: నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. గతంలో హీరోగా అనేక సినిమాలు చేసిన బాలకృష్ణ సామాజిక కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలు కూడా చేస్తున్నారు. ఒకపక్క నిర్మాతగా ఉంటూనే మరొక బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నారు. ఇప్పటికే ఇన్ని బాధ్యతలతో ఉన్న బాలకృష్ణ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తి హోస్ట్గా ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ అనే ఒక షో చేశారు.

దీనికి సంబంధించిన సీజన్ 1 గత ఏడాది పూర్తయింది. ఆ సీజన్ కి సూపర్ క్రేజ్ అయితే లభించింది. ఈ నేపథ్యంలో ఈ ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ చంద్రబాబు లోకేష్ తో కలిసి చేయగా దానికి అద్భుతమైన వ్యూస్ వచ్చాయి. రెండో ఎపిసోడ్ కూడా సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ వంటి కుర్ర హీరోలతో చేయగా దానికి కూడా మంచి వ్యూస్ లభించాయి. ఇక తాజాగా మూడో ఎపిసోడ్ మీద మాత్రం కాస్త సందిగ్ధత నెలకొంది.

అదేమిటంటే ఈ మూడవ ఎపిసోడ్ రమ్యకృష్ణ, రాశి ఖన్నాతో కలిసి చేసే అవకాశం ఉందని ముందు ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని మరో ప్రచారం మీదకు వచ్చింది. ఈ మూడవ ఎపిసోడ్ కోసం ఆయన శర్వానంద్ మైనేని, అడవి శేషులను తీసుకురాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ షూట్ ఈ నెల 22న జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి రాశి ఖన్నా రమ్యకృష్ణ తో ఒక ఎపిసోడ్ ఉంటుందా? అది నాలుగవ ఎపిసోడ్ అవుతుందా లేక అది కేవలం ప్రచారం మాత్రమేనా అనే విషయం మీద మాత్రం మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇక గత ఎపిసోడ్లో నిర్మాత నాగవంశీ కూడా కనిపించగా ఈ సందర్భంగా ఆయన తన ఫోన్ నుంచి త్రివిక్రమ్ కు కాల్ చేసి బాలయ్యతో మాట్లాడించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ నందమూరి బాలకృష్ణ ఎప్పుడు షోకి వస్తున్నావు? అని అడిగితే ఇప్పుడు వచ్చేయమంటే వచ్చేస్తానని త్రివిక్రమ్ అంటే ఎవరితో రావాలో తెలుసుగా అంటూ పవన్ కళ్యాణ్ తో రావాలని హింట్  ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిద్దరితో ఒక ఎపిసోడ్ ఉంటుందని అది ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఎలాగో మెగా కుటుంబానికి సంబంధించిన అల్లూ ఫ్యామిలీ ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రాంని నిర్వహిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా షోకి హాజరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. రాజకీయపరంగా కూడా ఏపీలో జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కి ప్రాధాన్యత సంతరించుకుంటుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Also Read: Meera Jasmine Hot Photos: అంతా కనిపించేలా వింత డ్రెస్సులో దర్శనమిచ్చిన మీరా జాస్మిన్.. లేటు వయసులోనూ ఘాటు ఫోజులు!

Also Read: NBK 107 Title: అన్నగారు ? రెడ్డి గారు? ఆ టైటిల్ కే మొగ్గు చూపుతున్న 107 మేకర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More