Home> వినోదం
Advertisement

Unstoppable With Nbk: బాలయ్య షోకు అలనాటి అందాల తారలు.. ప్రోమో మామూలుగా లేదు భయ్యా..!

Unstoppable latest Promo: బాలయ్య అన్‌స్టాప‌బుల్ షో మూడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను వదిలారు మేకర్స్.  ఇందులో టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సందడి చేశారు. వారు ఎవరంటే?
 

Unstoppable With Nbk: బాలయ్య షోకు అలనాటి అందాల తారలు.. ప్రోమో మామూలుగా లేదు భయ్యా..!

Unstoppable Third Episode Promo Released: నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) అన్‌స్టాప‌బుల్ (Unstoppable) షోతో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. తనదైన మార్కు హోస్టింగ్ తో షోను రక్తికట్టిస్తున్నాడు బాలయ్య. గత రెండు సీజన్లు నిర్విరామంగా జరగగా.. ప్రస్తుత సీజన్ లిమిటెడ్ ఎడిషన్​గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్ కూడా అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. తొలి రెండు ఎపిసోడ్లు సూపర్ హిట్ కాగా..తాజాగా మూడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను వదిలారు మేకర్స్. ఈ ప్రోమోలో సీనియర్ హీరోయిన్ సుహాసిని, శ్రియ, సీనియర్ డైరెక్టర్ జయంత్ పి.పరాన్జీ, హారీశ్ శంకర్ తో బాలయ్య చేసిన సందడిని చూపించారు. ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీ వేదికగా డిసెంబరు 22న స్ట్రీమింగ్ కు రానుంది. 

బాలయ్య, సుహాసినీది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ ఆ రోజుల్లోనే దంచవె మేనత్తా కూతురా అంటూ బాక్సాఫీస్ ను దంచేశారు. మరోసారి ఈ క్రేజీ కాంబో అన్‌స్టాప‌బుల్ షోలో సందడి చేయబోతుంది. మరోపక్క శ్రియ కూడా బాలయ్యతో మంచి సినిమాలు చేసింది. చెన్నకేశవరెడ్డి, పైసా వసూల్, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాల్లో వీరిద్దరి కెమెస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ బ్యూటీ కూడా మూడో ఎపిసోడ్ లో గెస్ట్ గా రాబోతుంది. మరోవైపు లక్ష్మీనరసింహ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన జయంత్ సి పరాన్జీ కూడా బాలయ్య షోకు రాబోతున్నాడు. ఇంకోవైపు మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా లెజండ్ తో ఆటలు ఆడటానికి రెడీ అయిపోయాడు. సాధారణంగా బాలయ్య గెస్ట్స్ ను ప్రశ్నలు వేస్తాడు, కానీ మూడో ఎపిసోడ్ లో అతిథులు బాలయ్యను కశ్చన్స్ వేయనున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. 

Also Read: Naa Saamiranga Update: నాగార్జున 'నా సామిరంగ'లో అల్లరి హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More