Home> వినోదం
Advertisement

Taraka Ratna Last Rites : తారకరత్న పార్థివదేహం వద్దకు మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యతో ముచ్చట్లు.. వీడియో వైరల్

Unknown Person At Taraka Ratna Last Rites నందమూరి తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సంగతి తెలిసిందే. అయితే అక్కడికి ఓ మతి స్థిమితం లేని వ్యక్తి వచ్చాడు. 

Taraka Ratna Last Rites : తారకరత్న పార్థివదేహం వద్దకు మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యతో ముచ్చట్లు.. వీడియో వైరల్

Balakrishna at Taraka Ratna Last Rites నందమూరి తారకరత్న మరణం పట్ల టాలీవుడ్ అంతా కూడా స్పందించింది. నేడు ఫిలిం చాంబర్‌లో ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శానర్థం ఉంచిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా తారకరత్నకు నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ మతి స్థిమితం లేని వ్యక్తి సైతం లోపలకు వచ్చాడు.

తారకరత్నకు నివాళి అర్పించాడు. పక్కనే ఉన్న బాలయ్యతోనూ ముచ్చట్లు పెట్టాడు. బాలయ్యకు సదరు వ్యక్తి ఏదో చెబుతున్నాడు. బాలయ్య కూడా శాంతంగానే విన్నట్టుగా కనిపిస్తోంది. అదే మామూలు స్థితిలో అయి ఉంటే.. బాలయ్య వేరేలా రియాక్ట్ అయ్యే వాడేమో. కానీ బాలయ్య ఏమీ అనకుండా శాంతంగా అలా మాట్లాడి పంపించాడు.

ఇక ఆ వ్యక్తిని పోలీసులు వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. తారకరత్న మీదున్న ప్రేమతోనే వచ్చాడా? లేక ఏమీ తెలియకుండా అలా వచ్చేశాడా? అని నెటిజన్లు అనుకుంటున్నారు.

గత నెలలో లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా సొమ్మసిల్లి పడిపోవడం, ఆ తరువాత అది హార్ట్ ఎటాక్ అని తెలియడం, ఎక్మో ట్రీట్మెంట్ ఇవ్వడం, వెంటిలేటర్ మీద చికిత్స అందించడం అందరికీ తెలిసిందే. అయితే దాదాపు 23 రోజుల చికిత్స అనంతరం మరణించినట్టుగా శివరాత్రి నాడు ప్రకటించారు. విదేశీ వైద్యులు కూడా తారకరత్నను బతికించలేకపోయారు.

Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More