Home> వినోదం
Advertisement

Pushpa The Rise Glimpse : వెనుకడుగు వేసిన పుష్ప టీం.. అవతార్‌ 2తో పాటు థియేటర్లో రాకపోవడానికి కారణం ఇదేనట

Pushpa The Rise Glimpse పుష్ప ది రైజ్ గురించి ఎంత మంది ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు బన్నీ. ఇక రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేశాడు సుకుమార్.

Pushpa The Rise Glimpse : వెనుకడుగు వేసిన పుష్ప టీం.. అవతార్‌ 2తో పాటు థియేటర్లో రాకపోవడానికి కారణం ఇదేనట

Pushpa The Rise Glimpse పుష్ఫ ది రైజ్ గ్లింప్స్ మీద గత కొన్ని రోజులుగా రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అవతార్ 2 సినిమాను థియేటర్లో ప్రదర్శించే సమయంలో పుష్ప గ్లింప్స్ కూడా ప్లే చేస్తారనే టాక్ వచ్చింది. దానికి తగ్గట్టుగా అల్లు స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో కొంత షూటింగ్ కూడా చేశారనే టాక్ వచ్చింది. అయితే అనుకోకుండా రష్యాలో పుష్పను రిలీజ్ చేయాలని అనుకోవడం, అక్కడకు టీం అంతా వెళ్లడం, విపరీతంగా ప్రమోట్ చేయడం అందరికీ తెలిసిందే.

ఆ బిజీలో పడి ఈ గ్లింప్స్ గురించి అంతగా పట్టించుకోలేదట. ఇక సింహం డైలాగ్ లీక్ అవ్వడంతో టీం కూడా కాస్త డిజప్పాయింట్ అయిందట. అందుకే ఈ గ్లింప్స్‌ను అవతార్ 2తో పాటుగా రిలీజ్ చేయకుండా వదిలేశారట. అయితే గ్లింప్స్ అని కాకుండా.. కొత్త ఏడాదికో సంక్రాంతికో చిన్న పాటి టీజర్‌ను విడుదల చేయాలని టీం ఆలోచిస్తోందట. మరి ఆ టైంకి అయినా కూడా వస్తుందా? లేదా? అన్నది అనుమానంగానే మారింది.

రష్యాలో పుష్పకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ఎంత కష్టపడి ప్రమోట్ చేసినా కూడా లాభం లేకుండా పోయిందట. పెట్టిన ఖర్చులు కూడా వెనక్కి రాలేదని తెలుస్తోంది. అయితే రష్యాలో  పుష్ప దెబ్బతో రెండో పార్ట్ అక్కడ విడుదల అవుతుందా?లేదా? అన్నది అనుమానంగానే మారింది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. రజినీకాంత్ ముత్తు సినిమా రికార్డులను ఆర్ఆర్ఆర్ కొల్లగొట్టేసింది.

అవతార్ 2తో పాటుగా ఒక పుష్ప ది రూల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఉంటే.. ఆ హైపే వేరే లెవెల్లో ఉండేది. అసలే ఇప్పుడు దేశమంతా కూడా అవతార్ 2 జపం నడుస్తోంది. దీనికి తోడు మన పుష్ప రాజ్ కూడా వచ్చి ఉంటే థియేటర్లు ఇంకా మోత మోగిపోయేవి.

Also Read : chiranjeevi-Radhika : చిరు రాధిక కాంబోలో సినిమా.. నాడు ఇచ్చిన మాటకోసమేనా?

Also Read : Prashanth Neel Bagheera : భగీరా లుక్ అదిరింది.. ప్రశాంత్ నీల్, హోంబళే కొత్త సినిమా అప్డేట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More