Home> వినోదం
Advertisement

Vijay-Trisha: విజయ్ లో త్రిషకి చిరాకు తెప్పించే విషయం.. అందువల్లే షూటింగ్స్ లో సైతం ఇబ్బంది!

Thalapathy Vijay- Trisha: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో.. స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్.. ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించింది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే విజయ్ తో కలిసి నటించేటప్పుడు.. త్రిష కి ఒక విషయం అసలు నచ్చేది కాదట. ఆ విషయం తనని చాలా.. ఇరిటేట్ చేసేదట.

Vijay-Trisha: విజయ్ లో త్రిషకి చిరాకు తెప్పించే విషయం.. అందువల్లే షూటింగ్స్ లో సైతం ఇబ్బంది!

Trisha About Vijay: తలపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ లు కలిసి.. ఇప్పటికీ నాలుగు సినిమాల్లో నటించారు. 2004లో వర్షం తమిళ్ రీమేక్ గిల్లి లో కలిసి.. నటించిన ఈ జంట తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జంటగా.. మరొక రెండు సినిమాల్లో నటించారు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత.. 2023లో విడుదలైన లియో సినిమాలో వీళ్ళు ఇద్దరు కలిసి నటించారు. 

కాగా ఈ మధ్యనే..గిల్లి సినిమా రీ రిలీజ్ అయ్యి.. విజయ్, త్రిషల జంటను మరొకసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.. అని కూడా పుకార్లు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రాలేదు. 

ఈ నేపథ్యంలో త్రిష, విజయ్ ల పాత వీడియోలు కూడా సోషల్ మీడియాలో.. మళ్లీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అందులో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిష విజయ్ గురించి మాట్లాడిన మాటలు.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక టీవీ షోలో మాట్లాడుతూ త్రిష విజయ్ లో తనకి నచ్చని.. అలవాటు గురించి చెప్పుకొచ్చింది.

షూటింగ్ జరుగుతున్న సమయంలో అందరూ ఒకటిగా కలిసి ఉండే వాళ్ళని, చక్కగా కబుర్లు చెప్పుకునే వాళ్ళని.. కానీ విజయ్ మాత్రం ఎక్కడో దూరంగా వెళ్లి కూర్చొని.. గంటల తరబడి గోడ వైపు చూస్తూ.. ఒక్కడే కూర్చొని వాడని చెప్పుకొచ్చింది త్రిష. ‘విజయ్ చాలా సైలెంట్ గా ఉంటాడు.. బయట సెట్స్ లో.. అసలు మాట్లాడడు,’ ఆని చెబుతూ..అదే తనకి నచ్చని విషయం అని త్రిష ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇక అదే ఇంటర్వ్యూలో.. విజయ్ లో తనకి అస్సలు నచ్చనిది.. తన సైలెన్స్ అని కూడా త్రిష చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన.. వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో లో త్రిష పక్కన విజయ్ కూడా ఉండటం గమనార్హం. అయితే త్రిష ఇలా చెబుతున్న సమయంలో కూడా విజయ్.. ఆమెను సైలెంట్ గా చూసారు తప్ప తిరిగి ఏమీ మాట్లాడలేదు.

ఇక మళ్ళీ త్రిష విజయ్ లు కలిసి.. లియో 2 సినిమాలో కూడా నటించాల్సి ఉంది. మరోవైపు GOAT సినిమాతో బిజీగా ఉన్న విజయ్.. ఈ మధ్యనే హెచ్ వినోద్ దర్శకత్వంలో.. కూడా ఒక సినిమాని ఓకే చేశారు. తలపతి 69 అనే టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
మరోవైపు త్రిష కూడా చేతినిండా.. సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో త్రిష త్వరలో విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కనిపించనుంది.

Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్‌ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?

Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More