Home> వినోదం
Advertisement

Five Heorines in Yashoda: సమంత సహా 'యశోద'లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా?

Five Heroines in Yashoda Movie: సమంత ప్రధాన పాత్రలో రూపొందిన యశోద మూవీలో ఆమెతో పాటు మరో నలుగురు హీరోయిన్లు కూడా నటించారు. ఆ వివరాల్లోకి వెళితే 

Five Heorines in Yashoda: సమంత సహా 'యశోద'లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా?

Total Five Heroines including Samantha in Yashoda Movie: సమంత హీరోయిన్ గా నటించిన యశోద మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. సమంత, మళయాళ నటుడు ఉన్ని ముకుందన్, తమిళ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలలో ఈ సినిమాను రూపొందించారు హరీష్ నారాయణ- హరి శంకర్ అనే దర్శక ద్వయం. ఈ సినిమాని ఐదు భాషల్లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలింగ కృష్ణ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకు తెలుగు వెర్షన్ డైలాగ్స్ తెలుగు జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి అందించడం మరో విశేషం.fallbacks

చంద్రబోస్, రామజోగయ్య లిరిక్స్ అందించిన ఈ సినిమాకు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరించారు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ తర్వాత కొంత అది మిక్స్డ్ టాక్ గా మారింది. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో సమంతతో పాటు మరో నలుగురు హీరోయిన్లు కూడా నటించారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. ఈ సినిమాలో సమంతతో పాటు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక నెగిటివ్ రోల్ లో పోషించారు. తమిళంలో శింబు సరసన పోడా పొడి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత తెలుగులో క్రాక్ సినిమా నుంచి ఎక్కవులాగా నెగిటివ్ పాత్రలు చేస్తూ వస్తున్నారు.fallbacks

ఆ తర్వాత నాంది, పక్కా కమర్షియల్ ఇప్పుడు రీసెంట్గా యశోద ఇలా అన్ని సినిమాల్లో ఆమె నటిస్తూ వస్తోంది. ఇక ఆమె ఒక హీరోయిన్ అయ్యారు. ఇక ఆ తర్వాత సమంతతో స్నేహం చేసే పాత్రలో కల్పిక గణేష్ కనిపించారు. వాస్తవానికి ఆమె కూడా ఒక హీరోయినే. నిజానికి ప్రయాణం సినిమాతో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ఆ తరువాత ఆరెంజ్, నమో వెంకటేశాయ, జులాయి, నిప్పు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా వరుస సినిమాలతో ఆమె ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత ఆమె మై డియర్ మార్తాండం అనే సినిమాతో హీరోయిన్గా మారారు. అంతేకాక సీత ఆన్ ది రోడ్డు అనే సినిమాలో కూడా ఆమె ప్రధాన పాత్రలో నటించారు.fallbacks

అలా ఆమె కూడా ఈ సినిమాలో నటించిన మూడో హీరోయిన్. ఇక వీరిద్దరూ కాకుండా ప్రియాంక శర్మ కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో సమంత, దివ్య శ్రీపాద, కల్పిక గణేష్, ప్రియాంక శర్మ వీరంతా ఒక గ్యాంగ్ లాగా కనిపిస్తారు. ఇక ప్రియాంక శర్మ విషయానికి వస్తే ఆమె గతంలో తెలుగులో సవారి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే శివకాశిపురం అనే సినిమాలో కూడా ఆమె కనిపించారు. తర్వాత ఎవరు అనే సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా కనిపించింది.fallbacks

సమంత కాకుండా ప్రియాంక శర్మ మరో హీరోయిన్ గా ఈ సినిమాలో నటించినట్టు అయింది.. ఇక ఇదే సినిమాలో సమంత సోదరి పాత్రలో ప్రీతి అస్రాని కూడా కనిపించింది. ఊకొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ప్రీతి అస్రాని  ప్రెజర్ కుక్కర్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఏ యాడ్ ఇన్ఫిటమ్ అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అలా సమంతతో పాటు మరో నలుగురు హీరోయిన్లు యశోద మూవీలో నటించినట్టు అయింది.

Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!

Also Read: Ram Charan on Acharya: కంటెంటే కింగ్.. అందుకే ఆ సినిమాను చూడలేదు.. రామ్ చరణ్ పరోక్ష కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More