Home> వినోదం
Advertisement

Top 7 Telugu Movies: నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైంలో టాప్ 7 తెలుగు సినిమాలివే!

Top 7 telugu movies 2023 on Amazon Prime: ఈ మధ్యకాలంలో థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో నెట్ఫ్లిక్స్,   అమెజాన్ ప్రైమ్ లో టాప్ 7 మూవీలు ఏమున్నాయో చూద్దాం. 

Top 7 Telugu Movies: నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైంలో టాప్ 7 తెలుగు సినిమాలివే!

Top 7 telugu movies 2023 on Netflix: ఈ మధ్యకాలంలో థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నెట్ఫ్లిక్స్,   అమెజాన్ ప్రైమ్,   డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి సంస్థలు తెలుగు కంటెంట్ తో పాటు ఇతర భాషల కంటెంట్ ని కూడా ఎక్కువగా ప్రేక్షకుల కోసం అందిస్తున్నాయి.

అయితే నెట్ఫ్లిక్స్ లో టాప్ సెవెన్ తెలుగు సినిమాలు ఏమున్నాయి అనేది ఒకసారి పరిశీలిస్తే ఆసక్తికరమైన సినిమాలు బయటకు వచ్చాయి. ఆ సినిమాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నెట్ఫ్లిక్స్ లో ఈ మధ్య విడుదలైన విరూపాక్ష సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా దుమ్ము రేపుతోంది. తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలం అనే ఒక ఆసక్తికరమైన సినిమా కూడా అందుబాటులో ఉంది. వెంకటేష్ మహా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Also Read: Bichagadu 3: బిచ్చగాడు 3 కూడా వస్తుందన్న విజయ్ ఆంటోనీ.. బెంబేలుఎత్తుతున్న జనం!

అలాగే మల్లేశం అని తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాకి కూడా నెట్ఫ్లిక్స్ లో మంచి ఆదరణ లభించింది. ఇక బాహుబలి మొదటి భాగం బాహుబలి 2 భాగానికి కూడా నెట్ఫ్లిక్స్  లో మంచి క్రేజ్ అయితే ఉంది. అలాగే ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా నెట్ఫ్లిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సినిమాల విషయానికొస్తే జాతి రత్నాలు అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప,   విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తున్నాయి. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంది. అడవి శేష్ హీరోగా నటించిన గూడచారి,   వెంకటేష్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ ద ఫస్ట్ కేసు కూడా అమెజాన్ ప్రైమ్ లో టాప్ సెవెన్ మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది.

Also Read: Sarath Babu Died: టాలీవుడ్లో విషాదం.. శరత్ బాబు కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More