Home> వినోదం
Advertisement

The Baap Of All Talk Shows: బాలకృష్ణ టాక్ షోపై కీలక ప్రకటన చేయనున్న అల్లుఅరవింద్

నందమూరి అభిమనులకు శుభవార్త... ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలకృష్ణ చేయబోతున్న టాక్ షో వివరాలు గురించి అల్లు అరవింద్ రేపు కీలకప్రకటన చేయనున్నారు.  

The Baap Of All Talk Shows: బాలకృష్ణ టాక్ షోపై కీలక ప్రకటన చేయనున్న అల్లుఅరవింద్

Balakrishna's The Baap Of All Talk Shows: నట సింహం బాలకృష్ణ (Hero Balakrishna) బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారండీ.. అవును.... 'ఆహా' (Aha)యజమాని అల్లుఅరవింద్ (Allu Arvind) ఈ విషయంపై గురువారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది. హీరో బాలకృష్ణ వెండి తెరపై చేసిన దానికంటే పది రేట్లు ఈ షోలో మ్యాజిక్ చేయబోతున్నాడని ఆహా యాజమాన్యం చెప్తుంది.

ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'లో బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్నాడు, గురువారం రోజున ఈ టాక్ షోపై కీలక ప్రకారం రానుంది. "బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్… అన్ స్టాపబుల్" (The Baap of All Talk Shows...Unstoppable) గా ఆహా లో ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేస్తున్నారు. 

Also Read: T20 World Cup 2021: కొత్త జెర్సీలతో టీమిండియా.. క్షణాల్లో వైరల్ అయిన పోస్ట్

మొదట ఈ టాక్ షోలో మోహన్ బాబు (Mohan Babu), విష్ణు (Manchu Vishnu), లక్ష్మి (Manchu Laxmi), మనోజ్ (Manchu Manoj) లతో ఈ షో ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. అంతేకాకూండా చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) కూడా ఈ షోలో పాల్గొనేలా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

వీరితో పాటుగా, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), అఖిల్ (Akhil) మరియు నాగ చైతన్యలు (Naga Chaitanya) కూడా ఈ టాక్ షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ చూడని డిఫరెంట్ కాంబినేషన్ లను తెరపైకి తెచ్చేవిధంగా ఈ టాక్ షోను ప్లాన్ చేస్తున్నారు. 

Also Read: Gambhir Sensational Commnets on Kohli: 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే' : గంభీర్ సంచలన వ్యాఖ్యలు

సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసి కోట్ల అభిమానులను సొంతం చేసుకున్న బాలకృష్ణ.. బుల్లితెర పై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో, ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడో చూడాల్సిందే. నిజంగానే ఈ షో 'బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్' అనిపించుకుంటుందో లేదో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More