Home> వినోదం
Advertisement

Pushpa part 2: పుష్ప పార్ట్ 2లో విశ్వరూపం ప్రదర్శించనున్న సీనియర్ నటి

Pushpa part 2: పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. అటు కలెక్షన్లు..ఇటు ప్రపంచవ్యాప్తంగా మేనియాతో దుమ్ము రేపుతోంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఓ సీనియర్ నటి విశ్వరూపం కన్పించనుందని తెలుస్తోంది. 

 Pushpa part 2: పుష్ప పార్ట్ 2లో విశ్వరూపం ప్రదర్శించనున్న సీనియర్ నటి

Pushpa part 2: పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. అటు కలెక్షన్లు..ఇటు ప్రపంచవ్యాప్తంగా మేనియాతో దుమ్ము రేపుతోంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఓ సీనియర్ నటి విశ్వరూపం కన్పించనుందని తెలుస్తోంది. 

లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఓ సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నాలతో విడుదలైన పుష్ప దేశవ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమా భారీ కలెక్షన్లు చేస్తోంది. అటు పుష్ప పాటలకు స్టెప్పులతో ప్రపంచవ్యాప్తంగా మేనియా వచ్చేసింది. అన్ని రంగాల్లో పుష్ప మేనియా స్పష్టంగా కన్పిస్తోంది. ఉత్తరాది బాక్సాఫీసును పుష్ప సినిమా ఊపేస్తోంది. ఏ విధమైన ప్రమోషన్స్ లేకుండానే పుష్ప సినిమా బాలీవుడ్‌లో వందలకోట్లు వసూలు చేయడం విశేషం.

పుష్ప సినిమా పార్ట్ 1 విజయంతో లెక్కల మాస్టారు సుకుమార్..పుష్ప 2 పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడీ సమయంలో పుష్ప రెండవ భాగం గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2లో సీనియర్ నటి ఇంద్రజకు కీలకమైన పాత్ర ఆఫర్ వచ్చిందట. స్వయంగా దర్శకుడు సుకుమార్ ఈ ఆఫర్ ఇచ్చాడట. పుష్ప మొదటిభాగంలో అనసూయ పాత్రను మించి..పుష్ప రెండవ భాగంలో ఇంద్రజ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం ప్రస్తుతం ఇంకా నిర్ధారణ కాలేదు. సినిమా వీధుల్లో మాత్రం గట్టిగానే వైరల్ అవుతోంది. 

Also read: Ghani Movie Trailer: 'ఈ బాక్సర్ కు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు'.. గని మూవీ ట్రైలర్ రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More