Home> వినోదం
Advertisement

Samantha Ruth Prabhu Fitness Secret: వయసు పైబడుతున్నా సమంత ఇంత అందంగా అందుకే ఉంటోందా.. బ్యూటీ సీక్రెట్స్ బట్టబయలు!

Samantha Ruthprabhu Diet Secret:  వయసు పైబడుతున్నా నాజూకైన శరీరంతో క్యూట్ గా కనిపించే చిరునవ్వుతో ఇంకా యవ్వనంలోనే ఉన్నట్టుండే సమంత ట్రేడ్ సీక్రెట్ ఏమిటో తెలుసా? 

Samantha Ruth Prabhu Fitness Secret: వయసు పైబడుతున్నా సమంత ఇంత అందంగా అందుకే ఉంటోందా.. బ్యూటీ సీక్రెట్స్ బట్టబయలు!

Samantha Ruthprabhu Fitness Secrets: సమంతని టాలీవుడ్ క్వీన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఈరోజు తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ఆమె పేరే గుర్తొచ్చేలా చేసుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే అనే సినిమాలో జెస్సీ పాత్ర ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ప్రస్తుతానికి సౌత్ లోనే ఒక టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది.

అయితే వయసు పైబడుతున్నా నాజూకైన శరీరంతో క్యూట్ గా కనిపించే చిరునవ్వుతో ఇంకా యవ్వనంలోనే ఉన్నట్టుండే ఆమె కొత్తగా వస్తున్న హీరోయిన్లకు సైతం ఇప్పటికీ పోటీ అనే చెప్పాలి. చాలా మంది కాలేజ్ అమ్మాయిలు సైతం సమంత డైట్ సీక్రెట్ ఏమిటి? ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటి? ఆమెలా అందంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అని వెతుకులాడుతూ ఉంటారు. ఇక ఈ మధ్యనే మయోసైటిస్ బారిన పడిన ఆమె ఇటీవలే కోలుకొని పూర్తిస్థాయిలో వర్కౌట్లు కూడా చేస్తున్న వీడియోలు షేర్ చేస్తూ ఉండడంతో ఆమె డైట్ సీక్రెట్ గురించి పెద్ద ఎత్తున గూగుల్ లో వెతుకులాడుతున్నారు అమ్మాయిలు. సో ఆమె గురించి మీ ముందుకు మాకు తెలిసిన సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

సమంత వర్కౌట్ (Samantha Ruth Prabhu)

ముందుగా సమంత ఎన్ని పనులు ఉన్నా ఎంత బిజీగా ఉన్నా వ్యాయామం చేయడం మానదు. రెండు పూటలా జిమ్ కి వెళ్లే ఆమె ఎక్కువ సమయం వర్కౌట్లు చేయడానికి వెచ్చిస్తూ ఉంటుంది. తన శరీరాన్ని ఎప్పటికప్పుడు నాజూగ్గా ఉంచుకునేందుకు ఆమె కొత్త కొత్త వర్కౌట్లు సైతం నేర్చుకుని చేస్తూ ఉంటుంది. కేవలం ఒక్క ఫిట్నెస్ ట్రైనర్ కే పరిమితం కాకుండా విషయం ఉన్న ఫిట్నెస్ ట్రైనర్లు అందరి దగ్గర ఆమె ఫిట్నెస్ లో మెళకువలు నేర్చుకుంటూ ఉంటుంది. చెన్నై హైదరాబాద్ నివాసాల్లో ఆమెకంటూ సపరేట్ జిమ్ సెట్ అప్ ఉంటుంది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే అక్కడి జిమ్ సెట్ అప్ వాడుకుంటుంది లేదా జాగింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

సమంత ప్రభు డైట్ ప్లాన్ (Samantha Ruth Prabhu Diet Plan)

సమంత పూర్తిగా శాకాహారి, ఒకప్పుడు మాంసాహారి అయినా ఆమె ఇప్పుడు అవి తినడం మానేసింది. ఉపవాసాలు, డైటింగ్స్ జోలికి పూర్తిగా వెళ్లని ఆమె అన్ని రకాల శాఖాహార ఆహార పదార్థాలు మితంగా తీసుకుంటూ ఉంటుంది. తన శరీరంలోకి కేలరీలు చేరతాయి ఏమో అనే భయంతో అన్ని తినకుండా ఉండదు, ఏది తిన్నా వెంటనే జిమ్ చేస్తూ ఉండడంతో ఆమె శరీరంలో ఎక్కడా కొవ్వు చేరిన దాఖలాలు కనిపించవు. అయితే తన వ్యాయామాలకు తగినట్టుగా ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుందట.

సమంత రూత్ ప్రభు బ్యూటీ సీక్రెట్
100 మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలంటే తాను పాటించే కొన్ని సీక్రెట్స్ ని గతంలో సమంత బయటపెట్టింది. అదేమిటంటే ఎప్పటికప్పుడు తన స్టైల్ మార్చుకుంటూ తనకంటూ సపరేట్ స్టాండర్డ్ ఉండేలా చూసుకుంటుందట. ఎక్కువగా వదులుగా ఉండే బట్టలు కాకుండా టైట్ ఫిట్ లో చూడగానే కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉండే బట్టలను డిజైన్ చేసుకుంటుందట. ఎక్కువగా క్లాసిక్ లుక్ లో స్త్రీ తత్వాన్ని ప్రతిబింబించే దుస్తులంటే తనకిష్టమని గతంలో ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను బయటకు వెళ్లాల్సి వస్తే సంస్కృతం లేకుండా వెళ్లనని సన్ స్క్రీన్ వాడితే టాన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని అని చెబుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Also Read: Ram Charan Good Morning America Show : ఇదీ రామ్ చరణ్‌ రేంజ్.. ఆ హాలీవుడ్ స్టార్ల తరువాత మనోడే.. అమెరికాలో మెగా పవర్

Also Read: RRR Movie: హాలీవుడ్ దిగ్గజాలు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో.. ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

 

Read More