Home> వినోదం
Advertisement

Producers meeting:షూటింగ్స్ బంద్ పై కీలక నిర్ణయం.. కానీ ఆరోజే క్లారిటీ!

Tollywood Producers meeting Highligts: టాలీవుడ్ నిర్మాతల మండలి సమావేశం ఎట్టకేలకు ముగిసింది. ప్రేక్షకులకు అందుబాటులో టిక్కెట్ రెట్లు, కంటెంట్, ఓటిటి వంటి విషయాల పై చర్చించారని తెలుస్తోంది.
 

Producers meeting:షూటింగ్స్ బంద్ పై కీలక నిర్ణయం.. కానీ ఆరోజే క్లారిటీ!

Tollywood Producers meeting Highlights: టాలీవుడ్లో కీలకంగా మారిన నిర్మాతల మండలి సమావేశం ఎట్టకేలకు ముగిసింది. ఈ సంధర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ నిర్మాతలు అందరం కూర్చొని మా సమస్యలపై చర్చించామని అన్నారు. ప్రేక్షకులకు అందుబాటులో టిక్కెట్ రెట్లు, కంటెంట్, ఓటిటి వంటి విషయాల పై చర్చించామని అన్నారు. షూటింగ్ లు బంద్ చేద్దామా లేక కొత్తవి మొదలు పెట్టకుండా జరుగుతున్న సినిమాల వరకు మాత్రమే షూటింగ్ లు జరపాలా అని ఇక మీదట డిస్కస్ చేస్తామని అన్నారు.

ఈ నెల 23న జరిగే మీటింగులో ఆల్ సెక్టార్స్ వాళ్లం కూర్చొని ఫిలిం ఛాంబర్ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. నిజానికి ఈ విషయం మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసం బుధవారం నాడు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సినిమాలు ఓటీటీ ఎప్పుడు విడుదల చేయాలి? వీపీఎఫ్‌ ఛార్జీలు, టికెట్ ధరలు, సినిమా నిర్మాణ వ్యయం, సినిమా వర్క్ కండిషన్స్, సినిమా టికెట్ రేట్లు వంటి విషయాల మీద నిర్మాతలు కీలక చర్చలు జరిపారు.

అంతేకాక ఈ షూటింగ్స్ వ్యవహారంలో మేనేజర్‌ల పాత్ర, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్‌ సమస్యలు, సినీ నటులు, టెక్నీషియన్స్‌ సమస్యలపై కూడా సినీ నిర్మాతలు చర్చించారని తెలుస్తోంది. ఇక బుధవారం నాడు జరిగిన ఈ సమావేశానికి కౌన్సిల్‌ సభ్యులు నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, వడ్లపట్ల మోహన్, యలమంచిలి రవి వంటి వారు హాజరయ్యారు.

Also Read: Nayanathara: నెట్ ఫ్లిక్స్ లో నయనతార-విగ్నేష్ ల పెళ్లి వీడియో.. గెట్ రెడీ!

Also Read: Deeksha Seth: బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. రీ ఎంట్రీ అదిరిపోయిందిగా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More