Home> వినోదం
Advertisement

Tollywood: ఆ సినిమా మొత్తంలో ఒక్కటే పాత్ర ఉంటుందట..ఆశ్చర్యంగా ఉందా

Tollywood: ఆ సినిమా మొత్తం ఒక్కటే పాత్ర ఉంటుందట. సింగిల్ షాట్..సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా సాగనుంది. టాలీవుడ్ మెరుపు తీగ హన్సిక్ నటిస్తున్న ఈ చిత్రంపై ఆసక్తి ఎక్కువవుతోంది. 
 

Tollywood: ఆ సినిమా మొత్తంలో ఒక్కటే పాత్ర ఉంటుందట..ఆశ్చర్యంగా ఉందా

Tollywood: ఆ సినిమా మొత్తం ఒక్కటే పాత్ర ఉంటుందట. సింగిల్ షాట్..సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా సాగనుంది. టాలీవుడ్ మెరుపు తీగ హన్సిక్ నటిస్తున్న ఈ చిత్రంపై ఆసక్తి ఎక్కువవుతోంది. 

రాజు దుస్సా దర్శకత్వంలో ఓ వైవిద్యమైన చిత్రం తెరకెక్కబోతోంది.105 మినిట్స్ (105 Minutes)టైటిల్‌తో నిర్మించబోతున్న సినిమాను రుద్రా సెల్యులాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ (Tollywood)కధానాయిక హన్సిక ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయబోతోంది. అంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. ఈ చిత్రం మొత్తం ఒకే ఒక పాత్ర అంటే క్యారెక్టర్ ఉంటుందట. అంటే సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్న హన్సిక క్యారెక్టర్ తప్ప మరో పాత్ర ఉండనే ఉండదు. అంటే సినిమా మొత్తం ఒక్కరే కన్పించనున్నారన్న మాట. సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్, రీల్ టైమ్, రియల్ టైమ్ ఈ చిత్రంలో హైలైట్స్ అని దర్శకుడు రాజు దుస్సా అంటున్నాడు. 

ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో హన్సిక (Hansika) కనిపించనుంది. 105 మినిట్స్‌ చిత్రం తన కెరీర్‌లోనే ఒక మైలురాయి అని హన్సిక్ చెబుతోంది. నిర్మాణ విలువలు తగ్గకుండా అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత బొమ్మక్‌ శివ తెలిపారు. ఈ సినిమా మేకింగ్‌ తనకో ఛాలెంజ్‌ అని..ఇలాంటి చిత్రాన్ని తన బ్యానర్‌లో నిర్మించడం చాలా సంతోషంగా ఉందని సినిమాటోగ్రాఫర్ దుర్గా కిశోర్ తెలిపారు.మొత్తానికి సింగిల్ క్యారెక్టర్ సినిమా 105 మినిట్స్ ఎలా ఉంటుందోననే ఆసక్తి  సర్వత్రా నెలకొంది.

Also read: Pawan Kalyan: టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్, ఆందోళనలో ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More