Home> వినోదం
Advertisement

Tollywood IT Raids : సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్?.. టాలీవుడ్‌లో మళ్లీ సోదాలు షురూ

Tollywood IT Raids టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్ అనే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఎప్పుడూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు, హీరోల ఆఫీస్‌లు, దర్శకుల ఇండ్లలో ఇలా ఐటీ రైడ్స్ జరుగుతూనే ఉంటాయి. తాజాగా నేటి ఉదయం కూడా ఇలాంటి ఐటీ రైడ్సే జరిగినట్టు తెలుస్తోంది.

Tollywood IT Raids : సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్?.. టాలీవుడ్‌లో మళ్లీ సోదాలు షురూ

Sukumar Office IT Raids టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల ఆఫీసులకు ఇళ్లకు ఐటీ, ఈడీ అధికారులు వచ్చారని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి టీమ్ దిగిందని సమాచారం. అయితే సుకుమార్ ఇంట్లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‌, సుకుమార్ ఇంట్లో, ఆఫీస్‌లో ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

అసలే ఇప్పుడు మైత్రీ మూవీస్ భారీ సినిమాలు నిర్మిస్తోంది. మైత్రీ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి అంటూ హిట్లు కొట్టేసింది. ఆ లెక్కల మీద కూడా ఐటీ కన్ను వేసినట్టు తెలుస్తోంది. ఇక సుకుమార్, మైత్రీ నిర్మాతల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి సినిమాల్లో భాగస్వామ్యులుగా ఉంటారన్న విషయం విదితమే.

పుష్ప రెండో పార్ట్ కోసం మైత్రీ కూడా లెక్కలేనంతగా ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో సుకుమార్, మైత్రీలు కూడా తగ్గేదేలే అంటున్నారు. అయితే ఈ విషయాల్లో లెక్కలు తేడా కొడుతున్నాయని, అందుకే ఐటీ అధికారులు ఇరువురి మీద నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

నేటి ఉదయం నుంచి కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఇలానే భారీ ప్రొడక్షన్ కంపెనీల మీద కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్ ఆఫీసుల్లోనూ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఐటీ రైడ్స్ జరిగిన తరువాత.. పెద్ద మొత్తంలో సొమ్ము గానీ అవకతవకలు జరిగినట్టుగా గానీ అధికారులు ఎప్పుడూ ప్రకటించలేదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More