Home> వినోదం
Advertisement

Tollywood Fans disappointed: ఫ్యాన్స్ ను ఉసూరుమనిపించిన హీరోలు.. ఒక్కరూ అప్డేట్ ఇవ్వలేదుగా!

Tollywood Fans disappointed on Ugadi: ఈ ఏడాది ఉగాది మాత్రం సినీ హీరోల అభిమానులందరినీ నిరాశపరిచింది, అసలు ఏమైంది? ఎందుకు నిరాశ పడ్డారు అనే వివరాల్లోకి వెళితే
 

Tollywood Fans disappointed: ఫ్యాన్స్ ను ఉసూరుమనిపించిన హీరోలు.. ఒక్కరూ అప్డేట్ ఇవ్వలేదుగా!

Tollywood heroes disappointed their fans: మిగతా ప్రాంతాల్లో పండుగ ఎలా జరుపుకుంటారో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాలలో పండుగలు అంటే ఒక రేంజ్ లో జరుపుకుంటారు. ఇక పండుగలు అంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఇంటిల్లిపాది కుటుంబంతో ఆనందంగా గడపడమే కాక మధ్యాహ్నం నుంచి సాయంత్రం, ఫస్ట్ షో ఇలా ఫ్యామిలీతో కలిసి సినిమాలకు కూడా వెళుతూ ఉంటారు. అలాగే తమ అభిమాన హీరోల పుట్టినరోజు అప్పుడు ఎలా అయితే అప్డేట్స్ వస్తాయో ఈ పండుగలకు కూడా ఏదో ఒక అప్డేట్ వస్తుందని సినీ హీరోల అభిమానులు భావిస్తూ ఉంటారు.

అయితే ఈ ఏడాది ఉగాది మాత్రం సినీ హీరోల అభిమానులందరికీ నిరాశపరిచింది. ఎందుకంటే ప్రస్తుతానికి బడా హీరోలు చేస్తున్న సినిమాలన్నీ ప్రస్తుతానికి షూటింగ్ స్టేజిలోనూ లేక మొదలవ్వాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఏ ఒక్క సినిమా నుంచి కూడా సరైన పోస్టర్ కానీ అప్డేట్ కానీ రాలేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దశలో ఉండగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, రామ్ చరణ్ ఆర్సి15, అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ సలార్ వంటివి షూటింగ్ దశలో ఉన్నాయి.

అయితే ఉగాది సందర్భంగా ఈ సినిమాల నుంచి ఏదైనా అప్డేట్స్ వస్తాయేమో అని అందరూ భావించారు. కానీ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడం నిరాశ పరుస్తోంది. అయితే పెద్ద హీరోల అభిమానులను కాస్త ఊరట పరిచే విధంగా చిరంజీవి భోళాశంకర్ సినిమా యూనిట్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా ఆగస్టు 11వ తేదీన సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

ఇక మరో పక్కన నందమూరి బాలకృష్ణ 108వ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నందమూరి బాలకృష్ణ కొత్తగా కనిపిస్తున్నారు. మరింత కొత్తగా సినిమాలో చూపిస్తామని అనిల్ రావిపూడి కూడా పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ గానీ రామ్ చరణ్ గానీ ప్రభాస్ ఇలా ఏ ఇతర కుర్ర హీరోల సినిమాల నుంచి అప్డేట్స్ కానీ పోస్టర్లు కానీ రాకపోవడం అంటే అభిమానులకు ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. 

Also Read: Modi Htao Desh Bachao : కలకలం రేపుతున్న మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లు.. ఆరుగురు అరెస్ట్!

Also Read: Samyukta Menon Serious: ఆ బాధ్యత లేదా.. సినిమా యూనిట్ మీద 'సార్' హీరోయిన్ ఫైర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 
Read More