Home> వినోదం
Advertisement

Ravi Tejas 70th film : రవితేజ 70వ సినిమా అనౌన్స్‌మెంట్

Ravi Tejas 70th film locked : రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న ఖిలాడి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ దశలో రామారావు ఆన్‌డ్యూటీ, ధమాకా మూవీలున్నాయి.

Ravi Tejas 70th film : రవితేజ 70వ సినిమా అనౌన్స్‌మెంట్

Tollywood Hero Mass Maharaj Ravi Tejas 70th film locked : మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తి చేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఈ ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తొలి బోణీ కొట్టింది రవితేజ మూవీనే. క్రాక్ సినిమాతో రవితేజ ( Ravi Teja) ఈ ఏడాది తొలి సక్సెస్ కొట్టడమే కాదు.. కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమాకు వస్తారనే నమ్మకాన్ని కూడా కలిగించాడు. అక్కడ నుంచి మొదలైన రవితేజ హవా వరస సినిమాలతో ఎక్కడా ఆగడం లేదు. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టేశాడు.

రవితేజ 70వ సినిమాకు (Ravi Teja 70th movie) సంబంధించిన అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న ఖిలాడి షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం షూటింగ్ దశలో రామారావు ఆన్‌డ్యూటీ, (Rama Rao OnDuty) ధమాకా (Dhamaka) మూవీలున్నాయి.

ఇటీవలే ధమాకా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. త్రినాథరావు నక్కిన దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read : Puneeth Rajkumar Death News: పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

ఇక రామారావు ఆన్‌డ్యూటీ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుందని సమాచారం. శరత్ మండవ రూపొందిస్తున్న ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను రేపు అంటే అక్టోబర్ 31 (October 31) ఆదివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రివీల్ చేయనున్నారు. రవితేజ (Ravi Teja) ఈ కొత్త మూవీని ఎవరితో ప్లాన్ చేశారో రేపు తెలియనుంది.

Also Read : Puneeth Rajkumar's death: పునీత్ రాజ్‌కుమార్ మృతికి అసలు కారణం ఇదేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More