Home> వినోదం
Advertisement

Komaram Venkatesh Death : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

Komaram Venkatesh Death కొమరం వెంకటేష్ మరణ వార్త తెలుసుకుని టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రముఖ నిర్మాతగా, ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడిగా కొమరం వెంకటేష్ ఎంతో సుపరిచితులు. ఆయన బ్రెయిన్ స్టోక్‌తో మరణించారు.

Komaram Venkatesh Death : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

Komaram Venkatesh Death టాలీవుడ్‌లో గత ఏడాదిగా విషాదాలు నెలకొంటూనే ఉన్నాయి. టాలీవుడ్ దిగ్గజాలు నెలకొరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, కైకాల, రమేష్‌ బాబు వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషాదాలు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సీనియర్ నటీనటులు, దర్శక నిర్మాతలు ఇలా ఎవరో ఒకరు నేలరాలుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత కొమురం వెంకటేష్ మరణించారు.

శుక్రవారం ఆయన బ్రెయిన్ స్టోక్‌తో మరణించారు. జూనియర్ ఆర్టిస్టుగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత ఆయన ఫిల్మ్ ఫెడరేషన్‌కు ప్రెసిడెంట్‌గా పని చేశారు. అనంతరం చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటి అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. ఆయన తన కెరీర్‌లో కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ కార్మిక సంఘాలు సంతాపాన్ని తెలిపాయి.

Read More