Home> వినోదం
Advertisement

RGV vs Perni Nani: సినిమా టికెట్ల అంశంపై మంత్రి పేర్ని నానితో ముగిసిన ఆర్జీవీ భేటీ

RGV vs Perni Nani: ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ..మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. సమావేశం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 

RGV vs Perni Nani: సినిమా టికెట్ల అంశంపై మంత్రి పేర్ని నానితో ముగిసిన ఆర్జీవీ భేటీ

RGV vs Perni Nani: ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ..మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. సమావేశం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకముందే వివాదాస్పద వ్యాఖ్యలతో సమస్యను మరింత జటిలం చేశారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. వివాదాస్పద దర్శకుడు పేర్ని నానితో ఓ ఛానెల్‌లో చర్చ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఈ విషయంపై తనను ఎప్పుడైనా కలవచ్చని మంత్రి పేర్ని నాని స్పష్టం చేయడంతో..ఆర్జీవీ ఆయనతో అపాయింట్‌మెంట్ కన్ఫాం చేసుకున్నారు. 

ఇందులో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్న ఆర్జీవీ (RGV)..అక్కడి నుంచి కారులో అమరావతి బయలుదేరారు. మంత్రి పేర్ని నానితో షెడ్యూల్ ప్రకారం భేటీ అయ్యారు. భేటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే భేటీకు ముందు మాత్రం ఆర్జీవీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దల కామెంట్స్, లేఖలపై స్పందించేందుకు గానీ, సినీ పరిశ్రమ తరపున గానీ తాను రాలేదన్నారు. సినిమా టికెట్లపై ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదని చెప్పారు.కేవలం ఓ దర్శకుడిగా మాత్రమే మంత్రి పేర్నినానిని (Perni Nani) కలుస్తున్నానన్నారు. తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.

Also read: Director Srikanth Addala: కొత్త హీరోను పరిచయం చేయనున్న శ్రీకాంత్ అడ్డాల!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More