Home> వినోదం
Advertisement

టాలీవుడ్ స్టార్ కమెడియన్ కూతురు సినీ ప్రవేశం.. హీరో ఎవరో తెలుసా?

Comedian Prudhvi Raj Daughter Sreelu to introduce as a heroine. తన కుమార్తె శ్రీలు సినీరంగ ప్రవేశం చేస్తున్నట్లు పృథ్వీరాజ్ స్వయంగా వెల్లడించారు. శ్రీలు హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు.

టాలీవుడ్ స్టార్ కమెడియన్ కూతురు సినీ ప్రవేశం.. హీరో ఎవరో తెలుసా?

Tollywood Comedian Prudhvi Raj Daughter Sreelu to introduce as a heroine: సాధారణ నటులుగా సినీరంగ ప్రవేశం చేసి స్టార్ కమెడియన్లుగా ఎదిగినవారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. తెలుగులో ఉన్నంత మంది కమెడియన్లు మరే సినీ పరిశ్రమలో లేరని చెప్పొచ్చు. రేలంగి, రాజబాబు, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్, సునీల్, నర్సింగ్ యాదవ్.. ఎందరో ఉన్నారు. స్టార్ కమెడియన్‌లలో 'పృథ్వీరాజ్' ఒకరు. అదేనండి.. '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీరాజ్. ఆయన తన కూతురును త్వరలోనే వెండితెరకు పరిచయం చేస్తున్నారు.

తన కుమార్తె శ్రీలు సినీరంగ ప్రవేశం చేస్తున్నట్లు పృథ్వీరాజ్ స్వయంగా వెల్లడించారు. శ్రీలు హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు. తన స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోందని పృథ్వీ తెలిపారు. శ్రీలు హోటల్ మేనేజ్మెంట్ చేసి మలేసియా వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నారట. అయితే డాన్స్ మీదున్న మక్కువతో హోటల్ మేనేజ్మెంట్ను పక్కనపెట్టారు. నటనపై ఇష్టం పెంచుకుని.. పలు సీన్స్ చూసి అనుకరించేవారు. దాంతో నటనలో కూడా ఆమెకు ప్రావీణ్యం వచ్చింది. ఇప్పటికే శ్రీలు తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ కావాల్సి ఉన్నా.. అది కుదరలేదు.

తాజాగా '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ మాట్లాడుతూ... 'మా అమ్మాయి శ్రీలు హోటల్ మేనేజ్మెంట్ చేసి మలేసియా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంది. కానీ డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అన్ని నేర్చుకుంది. నటనపై మక్కువతో సీన్స్ చూసి అనుకరించేది. శ్రీలుని ఇదివరకే  ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నా కుదరలేదు. చివరికి నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి మా ఈ సినిమాను నిర్మించారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ రైటర్ ఘటికాచలం గారు ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశారు. శ్రీలు, క్రాంతి  ప్రతిభ చేశాక నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను తీశారు' అని చెప్పారు. 

'సినిమాలోని పాటలన్ని అద్భుతంగా వచ్చాయి. సంగీత్ ఆదిత్య గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సాంగ్స్ విడుదల చేస్తాం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో చెబుతాం. శ్రీ పిఆర్ క్రియేషన్స్ ద్వారా ఈ కొత్త రంగుల ప్రపంచం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాను తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న దర్శకుడికి నా కృతజ్ఞతలు. అతను రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాను తీస్తున్నారు. త్వరలో ఆయన పేరు, వివరాలు మీకు చెబుతాం' అని పృథ్వీ చెప్పుకోచ్చారు.

Also Read: Reiki Web Series: ZEE5 నుంచి మరో కొత్త వెబ్ సిరీస్‌.. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్! తాడిపత్రి హత్య ఆధారంగా

Also Read: Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More