Home> వినోదం
Advertisement

Geetha Arts: గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా సునీత ధర్నా.. కారణం ఇదే!

Sunitha Boyapally protest at Geetha Arts. టాలీవుడ్‌కు చెందిన సునీత బోయపల్లి అనే మహిళా ఆర్టిస్టు గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా కూర్చుని ధర్నా చేశారు. 

Geetha Arts: గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా సునీత ధర్నా.. కారణం ఇదే!

Tollywood Artist Sunitha Boyapally doing protest in front of Geetha Arts Office: హైదరాబాద్ రోడ్ నెంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఓ మహిళ నానా హంగామా సృష్టించారు. టాలీవుడ్‌కు చెందిన సునీత బోయపల్లి అనే మహిళా ఆర్టిస్టు గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా కూర్చుని ధర్నా చేశారు. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతోనే ధర్నా చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. సమాచారం అందుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

సునీత బోయపల్లి ఇలా ఆందోళనలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు ఫిలిం ఛాంబర్, గీతా ఆర్ట్స్ కార్యాలయాల ముందు ఆమె ఆందోళకు దిగారు. గతంలో నిర్మాత బన్నీ వాసును వేధించిన సంఘటనలో ఈమెపై కేసు కూడా నమోదైంది. సినిమా అవకాశాల పేరిట బన్నీ వాసు తనను వంచించాడని పలుమార్లు ఆరోపణలు చేశారు. దాంతో బన్నీ వాసు, ఆయన వర్గీయులు సునీతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బన్నీ వాసు తనను బెదిరిస్తున్నాడని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ గతేడాది సునీత ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక లాక్ డౌన్ సమయంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో.. హైదరాబాద్ నగరంలో పుచ్చకాయలు అమ్ముతూ కనపడ్డారు. దాంతో సోషల్ మీడియాలో ఆమెకు భారీగా మద్దతు వచ్చింది. అంతేకాదు వైఎస్ షర్మిల పార్టీలో చేరుతున్నానంటూ కూడా ఓ వీడియో వదిలారు. ఏదేమైనా సినీత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. 

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన నిర్మాణ సంస్థ 'గీతా ఆర్ట్స్' అన్న విషయం తెలిసిందే. పసివాడి ప్రాణం, యమకింకరుడు, మెకానిక్ అల్లుడు, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు, హీరో, ఆరాధన లాంటి సినిమాలను డిస్టి బ్రూట్ చేసిన గీతా ఆర్ట్స్.. ఇటీవల వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. ఇటీవల అల వైకుంఠపురములో, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో హిట్స్ అందుకున్నాయి. ప్రస్తుతం 18 పేజస్ సినిమాను నిర్మిస్తోంది.  

Also Read: MS Dhoni Record: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!

Also Read: Jagadeesha Suchith Record: జగదీశ సుచిత్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో స్పిన్నర్‌గా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Read More