Home> వినోదం
Advertisement

Pooja Hegde: టూ పీస్ బికినీలో పూజా హెగ్డే అందాల ఆరబోత.. ధర ఎంతో తెలుసా?!!

వెషన్ కోసం మాల్దీవ్స్‌కు వెళ్లిన పూజా హెగ్డే.. తాజాగా బికినీలో ఉన్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ బికినీలో ఉన్న పూజా.. సముద్ర తీరాన తన జుట్టును సవరించుకుంటున్నారు. 
 

Pooja Hegde: టూ పీస్ బికినీలో పూజా హెగ్డే అందాల ఆరబోత.. ధర ఎంతో తెలుసా?!!

 Pooja Hegde shares Bikini photo in Instagram: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బిజీబిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే.. పూజా హెగ్డే (Pooja Hegde) పేరే వినిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.. గత మూడేళ్లుగా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు. అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోలతో కూడా నటిస్తూ.. తీరికలేకుండా ఉన్నారు. స్టార్ హీరో, దర్శకులకు పూజా ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు. అందుకే తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తన దగ్గరకు వచ్చిన కథలలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటూ టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవలి వచ్చిన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' హిట్ కావడంతో అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

ప్రస్తుతం పూజా హెగ్డే (Pooja Hegde) చేతిలో బీస్ట్, రాధే శ్యామ్, ఆచార్య వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఓ సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రానికి కూడా ఆమెనే ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ పడడంతో.. స్టార్ హీరోలు కూడా పూజానే కావాలని పట్టుబడుతున్నారట. ఇక విజయ్ బీస్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్‌కు వెళ్లారు పూజా. బుట్టబొమ్మ మాల్దీవ్స్‌ (Maldives) సముద్ర తీరాల అందాలను ఆస్వాదిస్తున్నారు. 

Also Read: Omicron scare: ఒక్క రోజులో 12,133 ఒమిక్రాన్​ కేసులు.. ఎక్కడంటే?

వెకేషన్ కోసం మాల్దీవ్స్‌కు వెళ్లిన పూజా హెగ్డే (Pooja Hegde).. తాజాగా బికినీలో ఉన్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ బికినీ (Bikini )లో ఉన్న పూజా.. సముద్ర తీరాన తన జుట్టును సవరించుకుంటున్నారు. పూజా తన అందమైన నడుముకు వెండి గొలుసు కూడా ఉంది. 'మెస్సీ పోనీటైల్‌లో నా ప్రయాణంను ఎప్పటికీ మరిచిపోను' అని కాప్షన్ ఇచ్చారు. #స్విమ్‌టైమ్ #వాకేహైర్‌క అని హ్యాష్ టాగ్స్ ఇచ్చారు. ఈ ఫొటో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తుంది. అభిమానులు పూజా అందాలకు ఫిదా అవుతున్నారు. ఫాన్స్ ఈ ఫొటోపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పూజా వేసుకున్న బికినీ ప్రస్తుతం డాష్ అండ్ డాట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఆ బికినీ ధర దాదాపుగా 5 వేలుగా ఉందట. 

Also Read: Bigg Boss Winner Sunny Remuneration: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్నీ పారితోషికం ఎంత, సంపాదన ఎంత

 
 
 
 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Read More