Home> వినోదం
Advertisement

Pragathi Dance: అమ్మో.. ప్రగతి మళ్లీ రచ్చచేసిందిగా! నాగిని డ్యాన్స్‌తో అందాల ఆరబోత మాములుగా లేదు!!

తాజాగా జిమ్‌ సెంటర్‌కి వర్కౌట్‌ కోసం వెళ్లిన ప్రగతి.. అక్కడ 'నాగిని' సాంగ్‌కి డాన్స్ చేశారు. ఆ పాటకు ఊరమాస్‌ స్టెప్పులేసి అందరిని అలరించారు.

Pragathi Dance: అమ్మో.. ప్రగతి మళ్లీ రచ్చచేసిందిగా! నాగిని డ్యాన్స్‌తో అందాల ఆరబోత మాములుగా లేదు!!

Tollywood Actress Pragathi Mahavadi shakes her legs to Nagin dance: 'ప్రగతి మహావాడి'.. తెలుగు సినీ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రగతి టాలీవుడ్‌ (Tollywood )లో గ్లామరస్‌ మదర్‌గా అందరిని ఆకట్టుకుంటున్నారు. తనదైన సహజ నటన, మాటలతో అమ్మ, అత్త, భార్య పాత్రలకు వన్నెతెచ్చారు. ఎక్కువగా స్టార్ హీరో, హీరోయిన్‌లకు అమ్మగా నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతకొంత కాలంగా ప్రతి సినిమాలో ప్రగతి (Pragathi Mahavadi) ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. 

కాస్త బొద్దుగా ఉండే ప్రగతి (Pragathi Mahavadi).. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు తనకు చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే లాక్‌డౌన్ సమయంలో జిమ్ లాంటి సదుపాయాలు లేకపోవడంతో ఇంట్లోనే వర్కౌట్స్ చేసారు. మరోవైపు తనకు ఇష్టమైన డాన్స్ కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రగతి షేర్‌ చేసే ప్రతి వర్కౌట్‌, డాన్స్ వీడియోలు వైరల్‌ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నాలుగు పదులు దాటుతున్నా కూడా ప్రగతి అంత ఫిట్‌గా ఉండడానికి కారణం ఫిట్‌నెస్‌, డాన్స్ కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Also Read: Plane crash: ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేస్తుండగా కూలిన విమానం- 9 మంది మృతి!

తాజాగా జిమ్‌ సెంటర్‌కి వర్కౌట్‌ కోసం వెళ్లిన ప్రగతి (Pragathi Mahavadi).. అక్కడ 'నాగిని' సాంగ్‌కి డాన్స్ (Nagin Dance) చేశారు. ఆ పాటకు ఊరమాస్‌ స్టెప్పులేసి అందరిని అలరించారు. దానికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో ఆమె షేర్‌ చేశారు. 'నేను చేసే ప్రతి పనిలో ఆనందాన్ని సృష్టిస్తాను. అది నాకు చాలా బాగుంటుంది' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'ప్రగతి మళ్లీ రచ్చచేసిందిగా', 'డాన్స్ ఇరగదీసారు', 'నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టారు' అంటూ ఫాన్స్ తమదైన శైలిలో కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ప్రగతి ఇప్పుడు బుల్లితెర, వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. 

Also Read: IND Vs SA Test Series: సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలుస్తాం- సరికొత్త రికార్డు సృష్టిస్తాం: కోహ్ల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More