Home> వినోదం
Advertisement

Bhumika Chawla Swimming: భూమిక బికినీ అందాలు అదరహో.. గ్లామర్ టచ్ మాములుగా లేదుగా!!

Bhumika Chawla Swimming video. తాజాగా బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న వీడియోను భూమిక పోస్ట్‌ చేశారు.

Bhumika Chawla Swimming: భూమిక బికినీ అందాలు అదరహో.. గ్లామర్ టచ్ మాములుగా లేదుగా!!

Bhumika Chawla Enjoying In Swimming Pool: అక్కినేని హీరో సుమంత్ నటించిన 'యువకుడు' సినిమాతో భూమిక చావ్లా (Bhumika Chawla) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో  'పవర్ స్టార్' పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ'లో అవకాశం వచ్చింది. ఖుషీ సినిమా బంపర్ హిట్ కావడంతో భూమిక రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఖుషీలో అందం, అభినయంతో అలరించిన ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. మహేశ్ బాబుతో నటించిన 'ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన 'సింహాద్రీ' చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. దాంతో భూమిక స్టార్ హీరోయిన్ అయిపోయారు. 

తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోలు అందరితో భూమిక జతకట్టారు. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించిన భూమిక 2007లో భరత్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఓ బాబుకు జన్మనివ్వడంతో సినిమాలకు చాలా ఏళ్లు దూరమయ్యారు. స్కిన్ షోకి దూరంగా ఉండే భూమిక.. హోమ్లీ హీరోయిన్‌గా కూడా భారీ ఫాలోయింగ్ దక్కించుకోవడం విశేషం.

Also Read: Chicken Cooked in Cough Syrup: దగ్గు సిరప్‌తో చికెన్ రెసిపీ.. ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా!!

కొంత కాలం పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం భూమిక ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉన్నారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇటీవల రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన భూమిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న వీడియోను భూమిక పోస్ట్‌ చేశారు. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ టూ పీస్‌ బికినీలో వెల్లకిలా పడుకుని స్విమ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో (Bhumika Chawla Swimming Video) నెట్టింట వైరల్ అయింది. 

స్కిన్ షోకి ఆమడ దూరం ఉండే భూమిక స్విమ్మింగ్ పూల్‌లో జలకాడుతూ కనిపించడం విశేషం. భూమిక తన సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించలేదు అని చెప్పలేం కానీ.. అందులో గ్లామర్‌ మోతాదు మాత్రం తక్కువే అని కచ్చితంగా చెప్పొచ్చు. అందుకే బికినీలో ఆమె కనిపించగానే అందరూ షాక్ అవుతున్నారు. భూమిక స్విమ్మింగ్ వీడియోకి తెగ లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'భూమిక బికినీ అందాలు అదరహో' 'భూమిక గ్లామర్ టచ్ మాములుగా లేదుగా', 'ఈ వయసులోనూ భూమిక అదరగొట్టేస్తోంది' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని 'ఎంసీఏ' సినిమాతో భూమిక (Bhumika) తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి అక్క, వదిన, భార్య పాత్రల్లో నటిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'యూటర్న్', 'రూరల్', 'సవ్యసాచి', 'సీటీమార్' వంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. తమిళంలో ఓ సినిమా, హిందీలో ఇంకో సినిమా చేస్తున్నారు. 

Also Read: Harbhajan Singh - Covid-19: టీమిండియా మాజీ క్రికెటర్​​కు కరోనా.. రెండు సంవత్సరాలుగా తప్పించుకున్నా..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More