Home> వినోదం
Advertisement

Naveen Polishetty: అయ్యయ్యో.. నవీన్ పొలిశెట్టికి ఎంత కష్టం వచ్చింది.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

Naveen Polishetty Health update: నవీన్ పొలిశెట్టి లైఫ్ లో ప్రాబ్లమ్స్ లను ఎలా ఎదుర్కొవాలో తనదైన స్టైల్ లో చేప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Naveen Polishetty: అయ్యయ్యో.. నవీన్ పొలిశెట్టికి ఎంత కష్టం వచ్చింది.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

Tollywood actor Naveen polishetty hand fracture post: టాలీవుడ్ నటుడు జాతీరత్నాలు ఫెమ్ నవీన్ పొలిశెట్టి తనదైన స్టైల్ లో అందరిని నవ్విస్తుంటారు. ఆయన మంచి కమెడియన్ గా, నటుడిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తన మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో క్రైమ్ థ్రిల్లర్ లో తనదైన శైలీలో అదరగొట్టారు.ఈ సినిమా ఆయనకు మంచి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత జాతీరత్నాలు మూవీలో నటించారు. జాతీరత్నాలు మూవీ ఎంత ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంటర్ టైన్మెంట్ డైలాగ్స్ లు, కామెడీ టైమింగ్, కౌంటర్ లు ఇవ్వడంలో నవీన్ పొలిశేట్టి అందరిని నవ్వించాడు. జాతీరత్నాలు తర్వాత నవీన్ పొలిశేట్టి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పుకొవచ్చు. 

 

ఈ సినిమా తర్వాత అతడు నటించిన మరో సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ క్రమంలో.. అమెరికాలో ఉండగా నవీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తొలుత అది చిన్న గాయం అనుకున్నారు. కానీ వైద్యులు స్కానింగ్ చేయగా చేతి విరిగినట్లు బైటపడింది. ప్రస్తుతం ఆయనకు కుడిచేయ్యికి వైద్యులు సిమెంట్ పట్టీ వేశారు. ఈ క్రమంలో నవీన్ పొలిశెట్టి ఒక ఫన్నీ వీడియోను ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. తొలుత ఆయన.. వెంకటెష్ మూవీలోని సింగిల్ హ్యాండ్ గణేశ్.. అనే డైలాగ్ చూశారు.

ఆ తర్వాత.. చిరంజీవి సినిమాలోని చెయ్యి చూశావా.. ఎంత రఫ్ గా ఉందో.. అంటూ మరో డైలాగ్ చేశారు. ఈ క్రమంలో తన చెయ్యి పరిస్థితి చూసి నవ్వుకుంటారు. అంతేకాకుండా.. చివరకు ఈ విషాదం నుంచి బైటపడతామని డీజీ పెట్టుకుంటే.. దానిలో కూడా డీజీ చేతులు పైకెత్తండంటూ చెప్తుంటాడు. దీంతో ఆయన నవ్వుకుంటారు. జీవితంలో అన్నికష్టాలను నవ్వుతూ ఎదుర్కొవాలని , ఇప్పుడున్న కష్టాలు, సమస్యలు ఎల్లకాలం ఉండవంటూ కూడా చెబుతారు. తన చేసిన ఫన్నీ ఘటనను వీడియో రికార్డు చేసి ఎక్స్  లో పోస్ట్ చేశారు. తన చేతుకి గాయమైందని, నొప్పిగా ఉందని చెప్పుకొచ్చారు.

Read more:Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..

కానీ కొన్నిరోజుల్లోనే అందర్ని నవ్వించడానికి మీ ముందుకొస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకచేత్తో పడిన కష్టాల్ని.. చెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు తన చేతిలో తినలేక.. పెంపుడు కుక్క మాదిరిగా టెబుల్ పైన ప్టేట్ పెట్టి శునకం మాదిరిగా తింటు ఉంటారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అయ్యయ్యో.. నవీన్ కు ఎంత కష్టంవచ్చిందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.  మరికొందరు అందర్ని నవ్వించే.. నవీన్ పొలిశెట్టి తొందరగా కోలుకొవాలని కోరుకుంటున్నట్లు కూడా ఆయనకు తమ సపోర్ట్ తెలియజేశారు. మరికొందరు భయ్యా.. ఇదేం లేదు. మరల మమ్మల్ని నవ్వించాలే.. అంటూ తెలంగాణ స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More