Home> వినోదం
Advertisement

Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్‌ మళ్లీ స్టార్ట్

టాలీవుడ్ (Tollywood) నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా 'టక్ జగదీష్' షూటింగ్ ఇటీవలే ప్రారంభమై మళ్లీ కరోనావైరస్ కారణంగా మళ్లీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది.

Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్‌ మళ్లీ స్టార్ట్

Nani Movie ‘Tuck Jagadish’ shooting re-started: టాలీవుడ్ (Tollywood) నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా 'టక్ జగదీష్' షూటింగ్ ఇటీవలే ప్రారంభమై మళ్లీ కరోనావైరస్ కారణంగా మళ్లీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. టక్ జగదీష్ బృందంలోని సాంకేతిక యూనిట్లో‌‌ ఒకరికి కరోనావైరస్ (Coronavirus)  పాజిటివ్ ( Tuck Jagadish crew tested positive for COVID-19) గా తేలడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించిన పదిరోజుల్లోనే ఆపేశారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురువారం మళ్లీ ప్రారంభమైంది. ట‌క్ జ‌గ‌దీష్ షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అయినట్లు దర్శకుడు శివ నిర్వాణ ( Director Shiva Nirvana ) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ట‌క్ జ‌గ‌దీశ్ షూటింగ్ కోసం సెట్‌లో శానిటైజేషన్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతోపాటు సెట్‌లో 38వ రోజు అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు.  Also read: Navratri Day 7: శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు

ఇదిలాఉంటే.. కరోనా లాక్ డౌన్ తరువాత ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. హీరో నాని కూడా అక్టోబర్ 7 నుంచి 'టక్ జగదీష్' షూటింగ్‌లో హాజరవుతున్నాడు. సుమారు 10 రోజుల షూటింగ్ తరువాత, ఈ సినిమా షూటింగ్‌కు కరోనా వల్ల బ్రేక్ పడి మళ్లీ ప్రారంభమైంది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌ టక్ జగదీష్ సినిమాను శివ నిర్వాణ ( Shiva Nirvana ) దర్శకత్వం వహిస్తుండగా..  సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ మూకీ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే.. నాని సరసన.. హీరోయిన్స్ రితు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.  Also read: Coronavirus Vaccine: కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి

అయితే ఇటీవల విడుదలైన వీ సినిమా చేస్తున్నప్పుడే ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పై ఉంది. దాదాపు 30-40శాతం పూర్తయిన టక్ జగదీష్ సినిమా షూటింగ్ కరోనా లాక్డౌన్ కారణంగా సుమారు 7నెలలపాటు నిలిచిపోయింది. అనుకున్న విధంగా షూటింగ్ జరిగితే ఈ సినిమా వేసవికాలం నాటికి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More