Home> వినోదం
Advertisement

Tillu Square OTT Streaming Date: ఆ రోజు నుంచే ప్రముఖ ఓటీటీలో టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ .. అఫీషియల్ ప్రకటన..

Tillu Square OTT Streaming Date: గత కొన్నేళ్లుగా తెలుగు సహా ఇతర భాషల్లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్వ్కేర్' మూవీ అంతకు మించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.

 Tillu Square OTT Streaming Date: ఆ రోజు నుంచే ప్రముఖ ఓటీటీలో టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ .. అఫీషియల్ ప్రకటన..

Tillu Square OTT Streaming Date: తెలుగులో  నిన్నటి మొన్నటి వరకు  సీక్వెల్స్ అంతగా ఆడేవి కావు. ఒకవేళ సీక్వెల్ తెరకెక్కిస్తే అంతే సంగతులు అని అభిప్రాయం బలపడిపోయింది. కానీ బలమైన కంటెంట్‌తో సినిమా తెరకెక్కిస్తే ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని పలు సినిమాలు నిరూపిస్తున్నాయి. ఈ కోవలో 'డీజే టిల్లు' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీ అంతకు మించి విజయం సాధించింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర దాదాపు 67 కోట్ల షేర్ ( రూ. 123 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసింది.

ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. మొత్తంగా  'డీజే టిల్లు' అనే బ్రాండ్‌తో  టిల్లు స్వ్కేర్ మూవీ మీడియం రేంజ్ మూవీల్లో ఎవరు టచ్ చేయని  బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది.  ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ బాయ్‌గా మారాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. అంతేకాదు టిల్లు బ్రాండ్‌తో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా  తొలిరోజే దాదాపు రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఔరా అనిపించింది.

సిద్దు జొన్నలగడ్డ విషయానికొస్తే..  10 యేళ్ల క్రితం  నాగ చైతన్య హీరోగా నటించిన 'జోష్‌' మూవీలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి చిన్నా చితకా పాత్రలతో అల‌రిస్తున్నాడు.  మొత్తంగా ఎన్నో ఒడిదుడుకుల తర్వాత సిద్దుకు డీజే టిల్లు మూవీతో పెద్ద బ్రేక్ వచ్చింది.  తాజాగా టిల్లు స్క్వేర్ మూవీతో మరోసారి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.  
టిల్లు స్క్వేర్ విషయానికొస్తే.. ఫస్ట్ పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు ఇట్టే కనెక్ట్ అవుతారు.  ఇక డీజే టిల్లు మాదిరి మాత్రం ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కుంభవృష్టి కురిపించింది.  
ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

తెలంగాణ  (నైజాం).. రూ. 8 కోట్లు..
రాయలసీమ( సీడెడ్).. రూ. 3 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 11 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 22 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 2 కోట్లు
ఓవర్సీస్ .. రూ. 3 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 40 కోట్ల ఫ్రాఫిట్ అందుకొని టాలీవుడ్‌లో 2024లె  మరో ఎపిక్‌గా హిట్‌గా నిలిచింది.

Also Read: Revanth Is Lilliput: 'రేవంత్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌': కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More