Home> వినోదం
Advertisement

August Releases: ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. సూపర్ స్టార్ తో పోటీపడుతున్న మెగా హీరోలు..!

August Movies: ఆగస్టులో సినిమాల జాతర షురూ కానుంది. వానకాలంలో వినోదాన్ని పంచేందుకు కొన్ని సినిమాలు రెడీ అయ్యాయి. ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాల్లో ఎక్కువ చిత్రాలు మెగా హీరోలవే.
 

August Releases: ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. సూపర్ స్టార్ తో పోటీపడుతున్న మెగా హీరోలు..!

August Movie Releases 2023: ప్రతి ఏటా ఆగస్టులో అధిక సంఖ్యలు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సంవత్సరం కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు రెడీ అయ్యాయి. ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ నెలలో ముందుగా మూవీ లవర్స్ అలరించేందుకు సిద్దమవుతున్న సినిమా 'ఎల్‌జీఎం'. ప్రముఖ క్రికెటర్ ధోనీ ఈ మూవీని నిర్మించారు. ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హారీశ్ కల్యాణ్, నదియా, ఇవానా, యోగిబాబు లీడ్ రోల్స్ లో నటించారు.

ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసిన తర్వాత వారానికే 'జైలర్' సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి వస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఇందులో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమాలో నువ్ కావాల్యయ్య అనే సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. 

సూపర్ స్టార్ వచ్చిన తర్వాత రోజు మెగాస్టార్ బరిలోకి దిగనున్నారు. చిరంజీవి నటించిన 'భోళాశంకర్' ఆగస్టు 11న విడుదల కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు జోడిగా తమన్నా, సిస్టర్ గా కీర్తి సురేషన్ నటించారు. మరో కీలకపాత్రలో సుశాంత్ కనపించనున్నారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

Also Read: HBD Mrunal Thakur: నాని 'హాయ్‌ నాన్న' నుంచి మృణాల్ ఫస్ట్ లుక్ అదిరింది..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' సినిమా  ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీపై కూడా అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరోవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీసింహ కొడుకు శ్రీసింహ 'ఉస్తాద్' సినిమాతో ఆగస్టు 12న విడుదల కానుంది. మరోవైపు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 'గాంఢీవధారి అర్జున' కూడా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Skanda Movie: రామ్ 'స్కంద' ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో వచ్చేసింది.. పుల్ సాంగ్ ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More