Home> వినోదం
Advertisement

Jai Balayya Song : నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన దృష్టి.. ట్యూన్ మీద పెట్టాల్సింది.. కాపీ ట్యూన్‌తో తమన్‌పై ట్రోల్స్

Thaman Gets Trolls for Veera Simhaa Reddy First Single తమన్ ప్రస్తుతం ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఒసేయ్ రాములమ్మ పాటను జై బాలయ్య పాటగా మార్చేశాడని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇలా కాపీ కొట్టి దొరికిపోవడం తమన్‌కు కామన్ అయిపోయింది.

Jai Balayya Song : నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన దృష్టి.. ట్యూన్ మీద పెట్టాల్సింది.. కాపీ ట్యూన్‌తో తమన్‌పై ట్రోల్స్

Osey Ramulamma Song Vs Jai Balayya Song : అసలే ఇప్పుడు మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. బాస్ పార్టీకి కాస్త నెగిటివ్ టాక్ రావడంతో అందరూ కూడా బాలయ్య వీరసింహారెడ్డి పాట మీద ఫోకస్ పెట్టేశారు. ఇదెలా ఉంటుందో అని ఎదురుచూడసాగారు. తమన్ మీద భారీ అంచనాలతో నందమూరి అభిమానులు రెడీగా ఉన్నారు. సౌండ్ బాక్సులు పగిలిపోయాయ్ అని తమన్ కూడా ఓ ట్వీట్ వేశాడు. కానీ తమన్ చెప్పినట్టుగా మరీ అంత మాస్ బీటేమీ కాదు అది.

అలా అని తమన్ కొట్టింది కొత్త బీట్ అసలే కాదు. ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్‌ను జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ మార్చేశాడు. ఇలా కాపీ ట్యూన్‌ను జనాలు పట్టేసి ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నాడు. ఇలా ట్యూన్లు కాపీ కొట్టడం తమన్‌కు కొత్తేమీ కాదు. ఇది వరకు అయితే తన సినిమాలవి తానే కొట్టేసేవాడు. బ్లాక్ బస్టర్ పాటను మళ్లీ తిప్పి తిప్పి వాడేశాడు. ఇలా తమన్ పాటలు వస్తున్నాయంటే ట్రోలర్స్, మీమర్స్ రెడీగా ఉంటారు.

 

ఎక్కడి నుంచి లేపేసి ఉంటాడో అని రీసెర్చ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలా తమన్ మళ్లీ దొరికేశాడు. అసలే బాస్ పార్టీ పాటతో దేవీ మీద దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు తమన్ ఇలా దొరికిపోయి దేవీని కాపాడేశాడు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా తమన్ మీద పడింది. పైగా తమన్ ఈ లిరికల్ వీడియోలో కొత్తగా కనిపించాడు.

లిరికల్ వీడియోలో తమన్ మరింత హుషారుగా కనిపించాడు. వేషాధారణ మార్చేశాడు. తెల్లచొక్క, బంగారం వేసుకుని కనిపించాడు. మాస్ స్టెప్పులు వేశాడు. ఇవన్నీ చాలా కొత్తగానే చేశాడు. కానీ ట్యూన్ మాత్రం కొత్తగా ఉందా? లేదా? అని చూసుకోలేదు. దీంతో కింగ్‌లో జయ సూర్య టైపులో అందరూ ఏకిపారేస్తున్నారు. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన దృష్టిలో సగం స్వరాలంకరణలో పెట్టి ఉంటే బాగుండేదన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు.

చివరకు బాస్ పార్టీ, జై బాలయ్య రెండూ కూడా ఓ మోస్తరుగా ఉన్నాయి. ఏవీ కూడా చార్ట్ బస్టర్ అయ్యే కేటగిరీలో చేరేట్టు కనిపించడం లేదు. చూస్తుంటే బాస్ పార్టీ మున్ముందు మరింతగా ట్రెండ్ అయ్యేలానే కనిపిస్తోంది. దేవీ పాటలు ఎప్పుడూ స్లో పాయిజన్ అన్న సంగతి తెలిసిందే.

Also Read : Kriti sanon Prabhas Marriage : ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా.. ఓపెన్ అయిన కృతి సనన్.. ఆదిపురుష్‌ ఎఫెక్టేనా?

Also Read : Malavika Mohanan pics : మాళవిక పెట్టింది గుండెల్లో మెలిక.. బిగుతైన అందాల విందు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More