Home> వినోదం
Advertisement

Thalapathy 67 Title : ఊచకోతకు రెడీ అయిన విజయ్.. వేరే లెవెల్‌లో లోకేష్ ప్లానింగ్

Thalapathy 67 Title Promo దళపతి విజయ్ 67వ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. బ్లడీ స్వీట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. లియో అనే టైటిల్‌తో విజయ్ మీద లోకేష్‌ కనకరాజ్ భారీ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తోంది.

Thalapathy 67 Title : ఊచకోతకు రెడీ అయిన విజయ్.. వేరే లెవెల్‌లో లోకేష్ ప్లానింగ్

LEO Bloody Sweet Promo దళపతి విజయ్ 67వ సినిమాకు సంబంధించిన టైటిల్ వచ్చింది. లియో బ్లడీ స్వీట్ అంటూ వదిలిన ప్రోమోలో విజయ్ కొత్తగా కనిపించాడు. ఊచకోతకు రెడీ అయినట్టుగా కనిపిస్తున్నాడు. కత్తి పట్టుకుని రౌడీల అంతు చూసేందుకు సిద్దమైనట్టుగా ఉన్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో ఈ లియో బ్లడీ స్వీట్ ఎలాంటి చాప్టర్‌ను, హిస్టరినీ క్రియేట్ చేస్తుందో చూడాలి. మొత్తానికి లోకేష్ మాత్రం మళ్లీ తన మార్క్ చూపించాడు. నాడు విక్రమ్ టైటిల్ రివీల్‌ను కొత్తగా చేసి చూపించాడు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌ను కూడా వెరైటీగా రివీల్ చేయించాడు.

 

విజయ్, లోకేష్‌ కలిసి చేసిన మాస్టర్ సినిమా అనుకున్నంతగా హిట్ అవ్వలేదు. అందులో లోకేష్ మార్క్ సీన్లు మిస్ అయ్యాయి. విజయ్‌ కోసం ఎలివేషన్లు పెట్టినట్టుగానే అనిపిస్తుంది. అయినా కూడా విజయ్ స్టామినాతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ లోకేష్ తన సినిమాటిక్ యూనివర్సిటీలోకి వచ్చాడు. విజయ్‌ను తన స్టైల్లో చూపించబోతోన్నాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడు ఈ మూవీ టీం కాశ్మీర్‌కు బయల్దేరిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఫ్లైట్ వేసి టీం అందరినీ తీసుకెళ్తున్నాడు లోకేష. ఇక ఇందులో విజయ్, త్రిషలు ముందు సీట్లో కూర్చుని సందడి చేశారు. చిన్న పిల్లలతో, విమాన సిబ్బందితో విజయ్ ముచ్చట్లు పెట్టాడు. టీంలో అందరినీ పేరు పేరునా పలకరిస్తూ పోయాడు. అందరినీ కెమెరాతో షూట్ చేశాడు. విజయ్ సింప్లిసిటీని చూసి అంతా ఫిదా అవుతున్నారు.

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More