Home> వినోదం
Advertisement

Movie Releases this Week: దాస్ కా ధమ్కీ, కబ్జా సహా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Telugu releases this Week wish shakuntalam: ఈ వారం అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు సందడి చేయబోతున్నాయి, ఆ సినిమాలు, వెబ్ సీరీసులు ఏమిటి? అనే విషయం మీద లుక్ వేద్దామా?

Movie Releases this Week: దాస్ కా ధమ్కీ, కబ్జా సహా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

OTT Releases This Week in Telugu Das ki Dhamki, Kabza: ఈ వారం థియేటర్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమా రేపు అంటే ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు సినిమా కూడా థియేటర్లలోకి రాబోతోంది.

ఇక ఈ సినిమాతో పాటు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన విడుదల అనే సినిమాను తెలుగులో ఏప్రిల్ 15వ తేదీన విడుదల పేరుతో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే మీడియా ప్రీమియర్ ద్వారా ఈ సినిమాకి మంచి టాక్ లభించింది.  ఇక మరోపక్క ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికి వస్తే రవిబాబు దర్శకత్వంలో పూర్ణ హీరోయిన్ గా రూపొందిన అసలు సినిమా ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: Balagam Hero House: ఇల్లు షూటింగ్ కి ఇస్తే థాంక్స్ కూడా చెప్పలేదు.. వేణుపై ఇంటి ఓనర్ షాకింగ్ కామెంట్స్

అలాగే ఏప్రిల్ 13వ తేదీన అబ్సెషన్ అనే సినిమా కూడా నెట్ ఫిక్స్ లో విడుదలవుతోంది. ఇక అదే విధంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 13వ తేదీన సింగల్ డ్రంక్ ఫిమేల్ రిలీజ్ అవుతూ ఉండగా ఏప్రిల్ 12నే ఆపరేషన్ నేషన్ అనే మరో సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. ఇక ఏప్రిల్ 18వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్ తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఇది కాకుండా కబ్జా సినిమా కూడా ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఓ కల అనే సినిమా ఏప్రిల్ 13వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతోంది. అంతేకాక  విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమా కూడా ఏప్రిల్ 14 నుంచి ఆహాలో రిలీజ్ అవుతోంది. ఇక ఇవి కాకుండా వెబ్ సిరీస్లు జూబ్లీ (అమెజాన్ ప్రైమ్), నెట్ ఫ్లిక్స్ లో లాస్ట్ కింగ్డమ్, వెదరింగ్, ఫెనోమెనా, క్వీన్స్ ఆన్ ది రన్, క్వీన్ మేకర్ తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

ఇది కూడా చదవండి: Balagam Director Venu: మా మనోభావాలు దెబ్బతీశాడు, చర్యలు తీసుకోండి.. బలగం డైరెక్టర్‌ వేణుపై ఫిర్యాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 
Read More