Home> వినోదం
Advertisement

Telugu movies: ఈ వారం థియేటర్‌లో సందడి చేసే సినిమాలు.. ఓటీటీలో వెబ్‌సిరీస్‌లు ఇవే!

Telugu Movies Releasing This Week:   ఈ వారం ఆసక్తికర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్‌ లో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికి వస్తే

Telugu movies: ఈ వారం థియేటర్‌లో సందడి చేసే సినిమాలు.. ఓటీటీలో వెబ్‌సిరీస్‌లు ఇవే!

Telugu Movies Releasing This Week: తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు అన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చేయడంతో ఇప్పుడు చిన్న సినిమాలు అలాగే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు కూడా ఒక్కటొక్కటిగా విడుదల అవుతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క మంచి సినిమా కూడా థియేటర్లో లేదు కానీ ఈ వారం ఆసక్తికర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్‌ లో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికి వస్తే తమిళనాడు శరవణన్ స్టోర్స్ అధినేత అరుళ్‌ శరవణన్‌ హీరోగా ద లెజెండ్‌ సినిమా రూపొందింది.

ఈ సినిమాలో ఆయన సరసన ఊర్వశి రౌటెల నటించగా ప్రభు, విజయ్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలలో నటించారు. హ్యారిస్‌ జయరాజ్‌ అందించిన ఈ సినిమాకు జెడీ -జెర్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 28న విడుదల కాబోతోంది. ఇక కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ విక్రాంత్‌ రోణ కూడా 28న విడుదల కాబోతోంది. నిరుప్‌ భండారీ, నీతా అశోక్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు అనుప్‌ భండారి దర్శకత్వం వహించగా బి.అజనీశ్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇక రవితేజ  హీరోగా దివ్యాంశ కౌశిక్‌, రజిష విజయన్‌ హీరోయిన్లుగా తొట్టెంపూడి వేణు కీలక పాత్రలో నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ కూడా అదే రోజున విడుదల అవుతోంది. సామ్‌ సి.ఎస్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు శరత్‌ మండవ దర్శకత్వం వహించారు. ఇక జాన్‌ అబ్రహాం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా హీరోహీరోయిన్లుగా నటించిన ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ సినిమా ఒకరోజు ఆగి అంటే 29న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు మోహిత్‌ సూరి దర్శకత్వం వచించగా అంకింత్‌ తివారీ, తనిష్‌ బాగ్చి, కౌశిక్‌ గుడ్డు సంగీతం అందించారు. 
ఒటీటీలో
ఇక ఈ వారం ఒటీటీలో విడుదల విడుదలవుతున్న సినిమాల విషయానికి వస్తే ఆర్‌.మాధవన్‌, సిమ్రన్‌ నటించిన రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో 26న విడుదల అవుతోంది. ఇక 29న జాన్వీకపూర్‌ నటించిన గుడ్‌ లక్‌ జెర్రీ డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అలాగే అదే రోజున రక్షిత్‌ శెట్టి, బాబీ సింహా నటించిన 777 చార్లీ ఊట్‌ లో విడుదల కానుంది. ఇక ఇవి కాక  నెట్ ఫ్లిక్స్ లో జులై 27న డ్రీమ్‌ హోమ్‌ మేకోవర్‌ (వెబ్ సిరీస్‌),  ద మోస్ట్‌ హేటెడ్‌ మ్యాన్‌  ఆన్‌ ది ఇంటర్నెట్‌ (వెబ్‌ సిరీస్‌) అలాగే జులై 28న కీప్‌ బ్రీతింగ్‌ (వెబ్‌ సిరీస్‌) విడుదల కానున్నాయి.

ఇవి కాక మసాబా మసాబా అనే హిందీ హిందీ సిరీస్‌, పర్పుల్‌ హార్ట్స్‌ అనే వెబ్‌ సిరీస్‌ కూడా విడుదల కానున్నాయి. ఇక జీ 5లో జులై 29న పేపర్‌ రాకెట్‌ అనే సినిమా రంగ్‌ బాజ్‌(హిందీ/ తెలుగు సిరీస్‌) విడుదల కానున్నాయి. ఇక ఆమెజన్ ప్రైమ్ వీడియోలో జులై 27న ద బ్యాట్‌మ్యాన్‌ (హాలీవుడ్‌), బిగ్‌ మౌత్‌ (కొరియన్‌ సిరీస్‌) విడుదల కానున్నాయి. ఇక జులై 29న ఆహాలో షికారు సినిమా విడుదల కానుంది. అలాగే జులై 27న డిస్నీ + హాట్ స్టార్ లో అదమస్‌ (కొరియన్‌ సిరీస్‌) అలాగే జులై 29న  19 (1) (ఎ) అనే సినిమా విడుదల కాబోతోంది. ఇవండీ ఈ వారం సినిమా విశేషాలు. 
Read Also: Sravanthi Chokkarapu: బిగ్ బాస్ స్రవంతి ప్రైవేట్ ఫోటోలు లీక్.. భర్తతో కలిసి బెడ్ పై!

Read Also: Divi Vadthya Pics: కళ్లకు కాటుక పెట్టి.. నాభి అందాలతో పైకెప్పిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More