Home> వినోదం
Advertisement

Surekha Vani: మరోసారి కూతురితో రచ్చ చేసిన సురేఖావాణి.. పొట్టి డ్రెస్సులో స్టెప్పులు అదిరాయిగా (వీడియో)!!

సురేఖావాణి, ఆమె కూతురు సుప్రిత ఓ హిందీ పాటకు తాజాగా డాన్స్ చేశారు. ఇందులో ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా యమ హుషారుగా చిందేశారు.

Surekha Vani: మరోసారి కూతురితో రచ్చ చేసిన సురేఖావాణి.. పొట్టి డ్రెస్సులో స్టెప్పులు అదిరాయిగా (వీడియో)!!

 Surekha Vani shaking leg With Her Daughter Supritha for Hindi song: సురేఖావాణి.. తెలుగు సినీ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై తనదైన నటనతో మెరిశారు. ముఖ్యంగా స్టార్ కమెడియన్ బ్రహ్మానందంకు జతగా నటించిన సినిమాలతో సురేఖావాణి (Surekha Vani) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెండితెరపై అలరించడమే కాకుండా సోషల్ మీడియాలో రచ్చచేస్తూ నేటితరం ఆడియన్స్‌కి మంచి కిక్కిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రిత (Supritha)తో కలిసి సురేఖావాణి రచ్చ చేస్తున్నారు. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్ ఉంది.

లాక్‌డౌన్ సమయంలో సురేఖావాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హంగామా చేశారో మనందరికీ తెలుసు. హాట్ హాట్ ఫొటోలు, డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించారు. ముఖ్యంగా తల్లీకూతుళ్లు కలిసి డాన్స్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఎవ్వరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఏ విధంగా రియాక్ట్ అయినా తమ లైఫ్ స్టైల్ తమదే అన్నట్లుగా ఈ ఇద్దరు నెట్టింట హవా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూతురితో కలిసి సురేఖావాణి చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. 

Also Read: Covid 19: 10 మంది మంత్రులు.. 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా! అసలు కారణం ఏంటంటే!!

తాజాగా సురేఖావాణి, సుప్రిత ఓ హిందీ పాటకు డాన్స్ చేశారు. ఇందులో ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా యమ హుషారుగా చిందేశారు. పొట్టి దుస్తుల్లో స్టెప్పులు వేసి అందరిని అట్రాక్ట్ చేశారు. సింపుల్ స్టెప్స్ అయినా చాలా బాగున్నాయి. ఈ వీడియోలో సుప్రిత అందాలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కూతురుతో కలిసి డాన్స్ (Surekha Vani Dance) చేస్తూ ఎంజాయ్ చేసిన ఆ వీడియోను సురేఖావాణి తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోకు తెగ లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలేవీ చేయకపోయినా సుప్రితను అనుసరించే వారి సంఖ్య చాలా ఎక్కువ. సుప్రిత త్వరలో సినిమాల్లోకి వచ్చినా ఆచ్చర్యపోనక్కర్లేదు. 

Also Read: F3 Movie postponed : ఈ సారి సంక్రాంతి అల్లుళ్లుగా కాదు.. సమ్మర్‌‌ సోగాళ్లుగా వస్తోన్న ఎఫ్​3

గతేడాది సురేఖావాణి (Surekha Vani) భర్త సురేష్ తేజ (Suresh Teja) మరణించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కూతురుతో కలిసి ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇటీవలి కాలంలో తన రెండో పెళ్లిపై వచ్చిన వార్తలను సురేఖావాణి ఖండించారు. ఇదే విషయమై సుప్రిత కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చిన వార్తలు రాస్తే బాగుండదు అని మీడియాపై ఫైర్ అయ్యారు. నాలుగు పదుల వయసులో ఉన్న సురేఖావాణి ఇటీవల ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Read More