Home> వినోదం
Advertisement

భల్లాలదేవుడు హాలీవుడ్ ఎంట్రీ..

భల్లాలదేవుడు హాలీవుడ్ ఎంట్రీ..

మన భల్లాలదేవుడు రాణా హాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడు. బాహుబలి  సినియాలో ప్రతినాయకుడి పాత్రను రాణా ఏ స్థాయిలో పోషించాడో అందరికీ తెలిసిందే. కథనాయకుడు ప్రభాస్ తో పోటీ పడుతూ మరి నటించి ప్రతినాయకుడి పాత్రకు వన్నె తెచ్చిన ఘనత రాణాకే దక్కుతుంది. టాలీవుడ్ లో ప్రతినాయకుడంటే చులకనగా చూసే రోజులు మారాయని రాణా నిరూపించాడు. భల్లాలదేవుడి ప్రాత పోషించి అందరినీ మెప్పించిన రాణాకు ఏకంగా హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఓ సినియా లో నటించేందుకు ఓకే అన్నాడట.

ఇటీవలే లండన్ లో జరిగిన 'సంకార్య యూకే 2017' కార్యక్రమానికి హాజరైన రాణా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా రాణా మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఓ హాలీవుడ్ చిత్రానికి సైన్ చేశానని వెల్లడించాడు. 1884 పోరుబందర్ సమీపంలో మునిగిపోయిన 'విజిలి' షిప్ కథాశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలిపాడు. ఈ సినిమా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్యర్యపోవాల్సిందేమీ లేదని ఈ సందర్భంగా రాణా వెల్లడించాడు.

Read More