Home> వినోదం
Advertisement

Taraka Ratna Last Photo: ఇదే చివరి ఫోటో అవుతుంది అనుకోలేదు...తారకరత్న ఫోటో షేర్ చేసి కన్నీరు తెప్పిస్తున్న అలేఖ్య!

Taraka Ratna Last Photo: తన భర్త తారకరత్నతో అలేఖ్యా రెడ్డి ఉన్న చివరి ఫోటో షేర్ చేస్తూ ఆమె ఎమోషనల్ అయింది, అమ్మా బంగారూ అనే మీ పిలుపుతో నన్ను నిద్ర లేపండి అంటూ ఆమె కామెంట్ చేసింది, ఆ వివరాల్లోకి వెళితే

Taraka Ratna Last Photo: ఇదే చివరి ఫోటో అవుతుంది అనుకోలేదు...తారకరత్న ఫోటో షేర్ చేసి కన్నీరు తెప్పిస్తున్న అలేఖ్య!

Taraka Ratna Wife Alekhya Reddy Shares Last Photo: 40 ఏళ్లు కూడా నిండకుండానే టాలీవుడ్ హీరో, రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న తారకరత్న గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని కేవలం సినీ అభిమానులు మాత్రమే కాదు తెలుగు ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అందరం చూశాం. మొదటి వివాహం విఫలం కావడంతో రెండో వివాహం తారకరత్నను చేసుకున్న ఆయన భార్య అలేఖ్యరెడ్డిని అయితే ఇప్పుడు ఎవరూ ఓదార్చలేని పరిస్థితి నెలకొంది.

ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది, మరీ ముఖ్యంగా పుట్టినరోజు మరో నాలుగు రోజుల్లో జరుగుతుందనగా ఆయన కన్నుమూయడంతో ముగ్గురు పిల్లలను అనాధను చేసి వెళ్లిపోవడంతో అలేఖ్య రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక అలేఖ్య రెడ్డి తన భర్తతో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ తన ఆవేదనను పంచుకుంటుంది. తాజాగా తారకరత్న తన పిల్లలతో ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అలేఖ్య రెడ్డి ఆ ఫోటోను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ కూడా ఆమె రాసుకొచ్చారు.

ఆమె తన ఇంస్టాగ్రామ్ ఫోటో షేర్ చేసి ఇదే మా చివరి ఫోటో చివరి ప్రయాణం అని నమ్మడం అంటే నా హృదయం పగిలిపోయినట్లు ఉంది ఇదంతా ఒక కల అవ్వాలని కోరుకుంటున్నా, నన్ను అమ్మా బంగారు అనే పిలిచే నీ గొంతు మరోసారి వినాలని ఉంది అంటూ ఎమోషనల్ గా రాసుకువచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఆమెకు భగవంతుడు ధైర్యం కలిగించాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ఆమె పెట్టిన పోస్ట్ కి కామెంట్లు చేస్తున్నారు.

తారకరత్న భౌతికంగా మీ వెంట లేకపోయినా ఎప్పటికీ మీతో ఉంటారని ఆయన అభిమానులుగా మేము కూడా ఎప్పటికీ మీకు అండగా ఉంటామని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాక ఆ పిల్లలకు మీరే ధైర్యం చెప్పాలని మీరే ఇలా ఢీలా పడిపోతే ఎలా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఫిబ్రవరి 22వ తేదీ తారకరత్న పుట్టినరోజు సందర్భంగా కూడా అలేఖ్య రెడ్డి ఎమోషనల్ గా ఒక పోస్ట్ చేసింది. ఇక ఇటీవల తారకరత్న చిన్న కర్మ నిర్వహించగా ఆయన దశదినకర్మ మార్చి రెండో తేదీన హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Aditi Rao Hydari - Siddharth Dance: ప్రేమ నిజమే, సిద్దూతో కలిసి హీరోయిన్ చిందులు.. ఇక అనౌన్స్ చేయడమే!

Also Read: Anchor Sowmya Dance: బాలయ్య పాటకు యాంకర్ సౌమ్య అదిరిపోయే స్టెప్పులు.. ఆ గ్రేస్ చూడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
Read More