Home> వినోదం
Advertisement

Nivetha Pethuraj: అందాల బొమ్మ నివేతా పేతురాజ్‌కు మెగా సినిమాలో ఛాన్స్

Nivetha Pethuraj: అటు అందం..ఇటు అభినయమే కాదు..మళ్లీ మళ్లీ చూడాలన్పించే ఏదో తెలియని గమ్మత్తును తనలో ఉంచుకున్న తమిళ బ్యూటీకి త్వరలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అద్భుత అవకాశం రానుంది. ఆ వివరాలు చూద్దామా..

Nivetha Pethuraj: అందాల బొమ్మ నివేతా పేతురాజ్‌కు మెగా సినిమాలో ఛాన్స్

Nivetha Pethuraj: అటు అందం..ఇటు అభినయమే కాదు..మళ్లీ మళ్లీ చూడాలన్పించే ఏదో తెలియని గమ్మత్తును తనలో ఉంచుకున్న తమిళ బ్యూటీకి త్వరలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అద్భుత అవకాశం రానుంది. ఆ వివరాలు చూద్దామా..

డ్రెస్సింగ్ ఏదైనా సరే..మోడర్న్ లేదా సాంప్రదాయ చీరకట్టు లేదా పంజాబీ డ్రెస్. ఆమెకు మాత్రం అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. హొయలొలికించే సోయగాలు ఆమె సొంతం. చక్కని రూపం..అంతకు మించిన అభినయంతో మంచి నటిగా రాణిస్తున్న తమిళ బ్యూటీ నివేతా పేతురాజ్. మధురైలో పుట్టిన నివేతా పేతురాజ్‌లో ఏదో తెలియని గమ్మత్తు ఉంటుంది. బహుశా అందుకే ఆమెను ఓసారి చూస్తే..మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తుంటుంది. మోడర్న్ గర్ల్ అంటే ఇలానే ఉండాలేమో అన్పిస్తుంటుంది. మెంటల్ మదిలో, అల వైకుంఠపురం, పాగల్, రెడ్ సినిమాల్లో నటించిన నివేతా పేతురాజ్..విరాటపర్వంలో కూడా ఉంది. అల వైకుంఠపురంతో పాపులారిటీ సంపాదించుకున్న నివేతా పేతురాజ్‌కు ఇప్పుడు మరో అద్బుతమైన ఆఫర్ వచ్చింది. 

నివేతా పేతురాజ్ ఏకంగా ఈసారి మెగాస్టార్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరంజీవి 154వ సినిమాలో రెండవ కథానాయికగా నటించనుందని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సోదరుడిగా ప్రత్యేకపాత్రలో నటించనున్న రవితేజ సరసన నివేతా పేతురాజ్ ఉంటుందని తెలుస్తోంది. వాల్తేర్ షిప్‌యార్డ్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా కన్పించనుంది. పక్కా మాస్ కథాంశంలో మెగాస్టార్ అభిమానులకు కావల్సిన కంటెంట్‌తో సినిమా తెరకెక్కనుంది. 2023లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

Also read: Priya mani: నీలి రంగు చీరలో.. చందమామలా ప్రియమణి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More