Home> వినోదం
Advertisement

Ghani Movie Special Song: గని నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మరోసారి రచ్చచేసిన తమన్నా!!

గని సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా.. సంక్రాంతి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం రిలీజ్‌ చేసింది. 

Ghani Movie Special Song: గని నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మరోసారి రచ్చచేసిన తమన్నా!!

Tamannaah's special song released form Varun Tej's Ghani Movie: మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati) తెరకెక్కిస్తున్న చిత్రం 'గని' (Ghani). అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీతోనే సాయి ముంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు గనిపై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

గని సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ తమన్నా (Tamannaah Special Song) ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా.. సంక్రాంతి (Sankranthi) పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం (జనవరి 15) రిలీజ్‌ చేసింది. 'రింగారే రింగా రింగా.. రింగా రింగా' అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాటలో తమన్నా తన స్టెప్పులతో (Tamannaah Dance) మరోసారి అదరిగొట్టారు. ఈ సినిమాకు తమన్‌ (Thaman S) సంగీతం అందిస్తున్నారు. ఇక రింగారే పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఆలపించారు. 

Also Read: Acharya Official Announcement: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'ఆచార్య' సినిమా వాయిదా ! రిలీజ్ ఎప్పుడంటే..?

గని చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తి బాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. న‌దియా మ‌రో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న గని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసే పనిలో ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో లవ్ అండ్‌ యాక్షన్ ఎంటర్‌టైన్‌గా దూపొందించిన ఈ మూవీ కోసం మెగా ఫాన్స్ వేటూరి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Aslo Read: అలానేనా ప్రవర్తించేది.. విరాట్ కోహ్లీకి జరిమానా విధించాలి లేదా సస్పెండ్ చేయాలి! ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More